Showing posts with label Awards & Rewards. Show all posts
Showing posts with label Awards & Rewards. Show all posts

Wednesday, June 10, 2020

Asia’s Nobel Prize-Ramon Magsaysay Awards cancelled


A Manila, Philippines based foundation that gives out Ramon Magsaysay Award announced that the awards are being cancelled due to COVID-19.

Highlights

  • The Ramon Magsaysay Award has been cancelled thrice in 6 decades. 
  • The awards were cancelled for the first time in 1970 due to financial crisis. 
  • It was cancelled again in 1990 due to disastrous earthquake. 
  • The award has been named after a popular Philippine president that died in a plane crash in 1957.

About the Award

  • The award is considered as the Nobel Prize of Asia. 
  • It was established in 1957. The Award recognizes and honours individuals that have achieved distinction in their field and help others generously.
  • The Award has been given in five categories namely journalism, government service, public service, literature and creative communication

Ramon Magsaysay

  • Magsaysay became the president of Philippines in 1953. 
  • The administration years of Magsaysay are cited as Golden Years of Philippines. 
  • He was well known for his generosity and agrarian reforms.

Saturday, October 8, 2016

మోహన్‌బాబుకు నవరస నట తిలకం బిరుదు



ప్రముఖ నటుడు మోహన్‌బాబు 40 వసంతాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో  2016 సెప్టెంబర్‌ 17న విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌బాబుకు టీఎస్‌ఆర్‌ లలిత కళా పరిషత్‌ తరపున టి.సుబ్బరామిరెడ్డి నవరస నట తిలకం బిరుదును ప్రదానం చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పి.జె.కురియన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Thursday, October 6, 2016

సూర్యనారాయణమూర్తికి దీన్‌దయాళ్‌ జోనల్‌ అవార్డు


పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జన్మదినం సందర్భంగా ఏటా జాతీయ, జోనల్‌ స్థాయిల్లో ఇచ్చే ఉత్తమ రైతు పురస్కారానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన  సూర్యనారాయణమూర్తి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి జోన్‌ నుంచి ఈయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. దేశంలో జాతీయ స్థాయిలో ఒక రైతుకు, 11 జోన్ల నుంచి ఒక్కొక్కరికి ఈ అవార్డు అందజేస్తారు. జాతీయస్థాయి అవార్డు పొందినవారికి రూ.లక్ష, జోనల్‌ స్థాయి అవార్డు పొందినవారికి రూ.50 వేలు అందిస్తారు. దీన్‌దయాళ్‌ జాతీయ అవార్డుకు నజఫ్‌గడ్‌కు చెందిన మహిళా రైతు కృష్ణయాదవ్‌ ఎంపికయ్యారు.

ఆస్కార్‌ ఉత్తమ విదేశీ చిత్రం బరిలో విసారణై


ఆస్కార్‌ బరిలో ఉత్తమ విదేశీ చిత్రం పురస్కారం కోసం మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా తమిళ చిత్రం విసారణైను భారత చలన చిత్ర సమాఖ్య ఎంపిక చేసింది. వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో ధనుష్‌ నిర్మించారు.  భారతీయ భాషల్లో రూపొందిన 29 చిత్రాల్ని పరిశీలించిన మండలి విసారణైను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కమిటీ చూసిన 29 సినిమాల్లో తెలుగు నుంచి వెళ్లిన కంచె, రుద్రమదేవి కూడా ఉన్నాయి. ఆస్కార్‌ న్యాయ నిర్ణాయక మండలి అధ్యక్షుడు కేతన్‌ మెహతా.

Saturday, October 1, 2016

మేఘనా పంత్‌కు ఎఫ్‌ఓఎన్‌ పురస్కారం



కుమొన్‌ లిటరరీ ఫెస్టివల్‌ ఎఫ్‌ఓఎన్‌ (ఫెలోస్‌ ఆఫ్‌ నేచర్‌) సౌత్‌ ఏషియా స్టోరీ పురస్కారానికి ముంబై రచయిత్రి మేఘనా పంత్‌ ఎంపికయ్యారు. పీపుల్‌ ఆఫ్‌ ది సన్‌ అనే కథకు గాను మేఘనకు ఈ గౌరవం దక్కింది. ఫ్రెంచ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, వైల్డ్‌ లైఫ్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వామ్యంతో కుమొన్‌ లిటరరీ ఫెస్టివల్‌ నిర్వాహకులు ఈ అవార్డును అందచేస్తున్నారు. ప్రకృతి సంబంధిత అంశాల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ పురస్కారం కింద గ్రహీతకు రూ.లక్ష నగదు అందజేస్తారు.

Tuesday, September 20, 2016

ఆర్‌బీఐకి ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కారం



రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)కు ఖేల్‌ ప్రోత్సాహన్‌ 2016 పురస్కారం లభించింది. దీన్ని 2016 ఆగస్టు 20న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ముంద్రా స్వీకరించారు. క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కల్పిస్తున్నందుకుగానూ ఆర్‌బీఐకి ఈ అవార్డు లభించింది.


Monday, September 19, 2016

మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టేట్‌ తెలంగాణ


2016 సం॥నికి గాను తెలంగాణ రాష్ట్రం మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టేట్‌ అవార్డును దక్కించుకుంది. ఏటా సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించే ఇండియా బిజినెస్‌ లీడర్స్‌ అవార్డ్స్‌లో భాగంగా ఈ అవార్డు వచ్చింది. అభివృద్ధిలోనే కాకుండా దేశ సమగ్రత, నిబద్ధతకు అనుగుణంగా వ్యాపార దృక్పథం, మార్కెటింగ్‌ నైపుణ్యాులు  ప్రదర్శించిన విజేతకు 11 ఏళ్లుగా సీఎన్‌బీసీ గ్రూప్‌ ఈ అవార్డు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

Saturday, September 17, 2016

గోరటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారం


ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారాన్ని ప్రకటించారు. ప్రజానాట్యమండలి, గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబరు 27న గుంటూరులో జరిగే జాషువా 121వ జయంత్యుత్సవ సభలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు అవార్డు కమిటీ వెల్లడిరచింది.

అబ్రహాం వర్గీస్‌ను అమెరికా జాతీయ మానవీయ పతకం



భారత అమెరికన్‌ వైద్యుడు, రచయిత అబ్రహాం వర్గీస్‌ను జాతీయ మానవీయ పతకానికి ఎంపిక చేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం వ్కెట్‌హౌస్‌ ప్రకటించింది.      

దినేష్‌ భరాదియాకు మార్కోనీ సొసైటీ పాల్‌ బారన్‌ యంగ్‌ స్కార్‌ అవార్డు


రేడియో తరంగాలపై చేపట్టిన పరశోధనకుగాను అమెరికాలోని భారత సంతతి పరిశోధకుడు దినేష్‌ భరాదియా (29)కు మార్కోనీ సొసైటీ పాల్‌ బారన్‌ యంగ్‌ స్కార్‌ అవార్డు లభించింది. సుమారు 150 సం॥లుగా వెంటాడిన చిక్కు ప్రశ్నకు ఆయన పరిశోధనలో సమాధానం లభించింది. ‘రేడియోలు ఏ పౌనఃపున్యంలో అయితే తరంగాలను తీసుకుంటాయో అదే పౌనఃపున్యంతో వాటిని ప్రసారం చేయలేవు. మధ్యలో ఎదురయ్యే అవరోధాలు దీనికి కారణం’ అనే భావనకు ఆయన తప్పని నిరూపించారు. దీంతో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సాంకేతికతను మరిన్ని మార్గాల్లో ఉపయోగించుకునేందుకు మార్గం సుగమమైంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న దినేష్‌ మస్సాచుసెట్స్‌ సాంకేతిక వర్సిటీలో శాస్త్రవేత్తగా కొనసాగుతున్నారు.

DJSIలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ నమోదు


హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు మరో గుర్తింపు లభించింది. డోజోన్స్‌ సస్టెయినబిలిటీ ఇండిసిస్‌(DJSI) 2016లో ఔషధ, బయో, లైఫ్‌ సైన్సెస్‌ రంగం విభాగంలో రెడ్డీస్‌ నమోదయింది. కార్పొరేట్‌ ప్రపంచంలో స్థిరమైన నాయకత్వాన్ని అందించినందుకు ఈ గుర్తింపు భించింది.
DJSI-Dow Jones Sustainability Indices

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రాజభాష కీర్తి పురస్కారం


అధికార భాష హిందీని దేశ వ్యాప్తంగా ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రధాన కార్యాలయాలు, మార్కెటింగ్‌, లైజన్‌ కార్యాలయాల్లో సమర్థంగా అమలు చేస్తున్నందుకుగాను సంస్థకు ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కారం లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన హిందీ దివస్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా విశాఖ ఉక్కు కర్మాగారం సీఎండీ పి.మధుసూదన్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

టెస్సీ థామస్‌కు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు


ఇమారత్‌ పరిశోధన సంస్థ ఏఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ టెస్సీ థామస్‌కు ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా(IEI) మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును ప్రకటించింది.
IEI-Institution of Engineers (India)

Sunday, September 11, 2016

యార్లగడ్డ, జయప్రద, సాయికుమార్‌కు శ్రీకృష్ణ దేవరాయ పురస్కారం-2016

కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సీనీనటు జయప్రద, సాయికుమార్‌కు బెంగళూరుకు చెందిన తెలుగు  విజ్ఞాన సమితి శ్రీకృష్ణ దేవరాయ పురస్కారం-2016 ప్రకటించింది.







జి.సతీష్‌రెడ్డికి రక్షణశాఖ అవార్డు


రక్షణశాఖ మంత్రి శాస్త్ర సలహాదారు, డీఆర్‌డీఓకు చెందిన క్షిపణుల, వ్యూహాత్మక ఆయుధాల డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డుల భించింది. క్షిపణులు, గగనతల సాంకేతికతలో విశిష్ట సేవలకుగాను ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇండియా-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌-బి15 ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 

సుదర్శన్‌ పట్నాయక్‌కు రష్యా పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డు


ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ రష్యాలో పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డును గెలుచుకున్నారు. రష్యాలో జరిగిన సైకత శిల్ప పోటీలో అహింస, శాంతి కోసం మహాత్మాగాంధీ
పేరుతో సుదర్శన్‌ పట్నాయక్‌ సృజించిన సైకత శిల్పం అత్యధిక ప్రజాదరణ పొంది బహుమతి గెలుచుకుంది.

జాకీచాన్‌కు ఆస్కార్‌ జీవితకాల సాఫ్యల పురస్కారం


జాకీచాన్‌కు ప్రఖ్యాత ఆస్కార్‌ జీవితకా సాఫల్య పురస్కారాన్ని అందించనున్నట్లు అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. సినిమా పరిశ్రమకు అసమాన సేవలు  అందించినవారికి 1950 నుంచి ఆస్కార్‌ జీవితకాల సాఫల్య  పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కారం అందుకోబోతున్న 89వ నటుడిగా జాకీచాన్‌ నిలిచారు. జాకీచాన్‌ 1962లో బిగ్‌ అండ్‌ లిటిల్‌ వాంగ్‌ టిన్‌ బార్‌తో బాలనటుడిగా సినిమా ప్రయాణం ప్రారంభించాడు. ఆ తర్వాత స్టంట్‌ మ్యాన్‌గా మారాడు. 1978లో వచ్చిన ‘స్నేక్‌ ఇన్‌ ది ఈగిల్స్‌ షాడో’తో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.  https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

Saturday, September 3, 2016

తెలంగాణకు 26 పతకాలు


తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రపతి శౌర్య పోలీస్‌ పతకాలు 2, శార్య పోలీసు పతకాలు కలిపి మొత్తం 24 పతకాలు లభించాయి. వీటితో పాటు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 1, అత్యుత్తమ సేవా పతకాలు 11 లభించాయి. 2016 ఫిబ్రవరిలో బెంగళూరులో ఉగ్రవాది ఆం జెబ్‌ అఫ్రిదిని పట్టుకునేందుకు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన శ్రీనివాసుకు శౌర్యచక్ర ప్రకటించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్సై దూదేకుల సిద్ధయ్య, కానిస్టేబుల్‌ నాగరాజకు మరణానంతరం రాష్ట్రపతి శౌర్య పోలీస్‌ పతకాలు ప్రకటించారు.

శౌర్యచక్ర
1. కె.శ్రీనివాసు(కానిస్టేబుల్‌, నిఘా విభాగం)


రాష్ట్రపతి శౌర్య పోలీస్‌ పతకం
1. దూదేకుల సిద్దయ్య (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, నల్గొండ)


2. నాగరాజ (కానిస్టేబుల్‌, నల్గొండ)


రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
1 రాజీవ్‌ రతన్‌, డిజి, ఫైర్‌ సర్వీసెస్‌

రామలక్ష్మికి మాలతీచందూర్‌ పురస్కారం-2016


ప్రముఖ కథా, నవలా రచయిత్రి కె.రామలక్ష్మి 2016 సం॥నికి గాను మాలతీచందూర్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్‌ సొసైటీ, చందూర్‌ కుటుంబం, స్నేహితులు సంయుక్తంగా 2014 నుంచి ఈ అవార్డును అందిస్తున్నారు.