Showing posts with label క్రీడా విశేషాలు. Show all posts
Showing posts with label క్రీడా విశేషాలు. Show all posts

Saturday, October 1, 2016

దీపా మలిక్‌కు రజతం



పారాలింపిక్స్‌లో మహిళ షాట్‌పుట్‌ (ఎఫ్‌-53) ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి, 46 ఏళ్ల దీపా మలిక్‌ రజత పతకాన్ని సొంతం చేసుకుంది, దీంతో పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 2016 సెప్టెంబర్‌ 12న జరిగిన ఫైనల్లో దీపా ఇనుప గుండును 461 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. ఫాతిమా నెధమ్‌ (బహ్రెయిన్‌-476 మీటర్లు) స్వర్ణం సాధించగా, దిమిత్రా కొరోకిడా (గ్రీస్‌-428 మీటర్లు) కాంస్యం సంపాదించింది. దీపా మలిక్‌ 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అందుకొని ఈ అవార్డు పొందిన పెద్దవయస్కురాలిగా (42 ఏళ్ల వయసులో) గుర్తింపు పొందింది.

Friday, September 30, 2016

పొరాలింపిక్స్‌లో మరియప్పన్‌ తంగవేలుకు స్వర్ణం


పారాలింపిక్స్‌లో 2016 సెప్టెంబర్‌ 11న జరిగిన పురుషుల హైజంప్‌ టి-42 లో తమిళనాడుకు చెందిన మరియప్పన్‌ తంగవేలు  స్వర్ణ పతకం సాధించాడు, దీంతో ఒలిపింక్స్‌లో భారత్‌ నుంచి హైజంప్‌ విభాగంలోస్వర్ణ పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే విభాగంలో నోయిడాకు చెందిన వరుణ్‌ సింగ్‌ భటి కాంస్యం సాధించాడు, తంగవేలు 189 మీ.ఎత్తుకు ఎగిరి అగ్రస్థానంలో నిలవగా భటి 186 మీ.తో మూడో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన సామ్‌గ్రెవే (186) రెండో స్థానంతో రజతం అందుకున్నాడు. 

Wednesday, September 21, 2016

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెస్కే ప్రసాద్‌


భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్‌ నియమితులయ్యారు. ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో సందీప్‌ పాటిల్‌ స్థానంలో ప్రసాద్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.భారత్‌ తరపున ఎమ్మెస్కే ప్రసాద్‌ 6 టెస్టులు, 17 వన్డేలు ఆడారు. బీసీసీఐ సెలక్షన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడైన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ ప్రస్తుతం జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలోనూ ఏడాది పదవీకాలం కూడా పూర్తి చేసుకున్నాడు. దేవాంగ్‌ గాంధీ, గగన్‌ ఖోడా, శరణ్‌దీప్‌ సింగ్‌, జతిన్‌ పరాంజేప్‌ సభ్యులుగా నియమితులయ్యారు. సెలక్టర్‌ పదవికి రేసులో ఉన్న వెంకటేశ్‌ ప్రసాద్‌ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. 


Tuesday, September 20, 2016

వన్డేల్లో 444 పరుగుతో ఇంగ్లండ్‌ సరికొత్త రికార్డ్‌



వన్డే క్రికెట్‌లో ఎక్కువ పరుగు చేసిన జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డ్డు నెలకొల్పింది. 2016 ఆగస్టు 30న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌  మధ్య జరిగిన వన్డేలో ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 444 పరుగులు చేసింది. దీంతో 2006లో నెదర్లాండ్‌పై శ్రీలంక చేసిన 443 పరుగుల రికార్డును అధిగమించింది.

యోగేశ్వర్‌ దత్‌కు పతక ప్రమోషన్‌


2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రెజ్లర్‌ యోగేశ్వర్‌దత్‌ సాధించిన కాంస్యంను 4 సం॥ తర్వాత రజతంగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఒలింపిక్స్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా రెజ్లర్‌ కుదుఖోవ్‌ అంతర్జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (వాడా) నిర్వహించిన డోపింగ్‌ పరీక్షలో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజవు కావడంతో యోగేశ్వర్‌కు రజతం దక్కింది. పురుషుల 60 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగం ప్రి కార్టర్‌ ఫైనల్లో బెసిక్‌ కుదుఖోవ్‌ చేతిలో యోగేశ్వర్‌ ఓడిపోయాడు అయితే కుదుఖోవ్‌ ఫైనల్‌కు చేరడంతో వచ్చిన రేప్‌చేజ్‌ అవకాశంతో యోగేశ్వర్‌ కాంస్య పతకం సాధించాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌, బీజింగ్‌ గేమ్స్‌లో కాంస్యం సాధించిన కుదుఖోవ్‌ 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

ఐరోపా ఉత్తమ ఫుట్‌బాలర్‌ రొనాల్డో


పోర్చుగల్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో రెండోసారి కూడా యూఈఎఫ్‌ఏ (ఐరోపా దేశా ఫుట్‌బాల్‌ సంఘం) ఉత్తమ యూరప్‌ ప్లేయర్‌గా నిలిచాడు. రియల్‌ మాడ్రిడ్‌ను చాంపియన్స్‌ లీగ్‌ విజేతగా నిలిపడంతోపాటు ఈ ఏడాది పోర్చుగల్‌కు యూరోకప్‌ను అందించడంలో ముఖ్యపాత్ర పోషించినందుకుగాను రొనాల్డోకు ఈ అవార్డు దక్కింది. నార్వే క్రీడాకారిణి అదా హెగెర్బర్గ్‌కు మహిళ విభాగంలో అవార్డు దక్కింది.


UEFA - Union of European Football Associations


Saturday, September 17, 2016

బెథాని మాటిక్‌, సఫరోవా జోడికి యూఎస్‌ ఓపెన్‌-2016 మహిళ డబుల్స్‌ టైటిల్‌


యూఎస్‌ ఓపెన్‌-2016 మహిళ డబుల్స్‌ టైటిల్‌ను బెథాని మాటిక్‌ (అమెరికా)-సఫరోవా(చెక్‌ రిపబ్లిక్‌) గెలుచుకున్నారు. ఫైనల్లో గర్సియా-మ్లెడనోవిచ్‌ (ఫ్రాన్స్‌)ను ఓడిరచారు.

యూఎస్‌ ఓపెన్‌-2016 పురుషుల సింగిల్స్‌ విజేత నొవాక్‌ జకోవిచ్‌


యూఎస్‌ ఓపెన్‌-2016 పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను స్టానిన్లాస్‌ వావ్రింకా(స్విట్జర్లాండ్‌) నెగ్గాడు. ఫైనల్లో డిఫెండిరగ్‌ ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా)ను ఓడిరచాడు. కెన్‌ రోజ్‌వెల్‌ (35 సం॥లు-1970లో) తర్వాత యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన పెద్ద వయస్కుడిగా వావ్రింకా (31 సం॥లు) నిలిచాడు.  వావ్రింకాకు ఇది కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2014లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, 2015లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ను  గెలిచాడు.

యూఎస్‌ ఓపెన్‌-2016 మహిళ విజేత ఎంజెలిక్‌ కెర్బర్‌


యూఎస్‌ ఓపెన్‌-2016 మహిళ విజేతగా ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) నిలిచింది. మహిళ సింగిల్స్‌ ఫైనల్లో ప్లిస్‌కోవా(చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడిరచింది. కెర్బర్‌ కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2016  జనవరిలో కెర్బర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గింది. ఇటీవలే నెంబర్‌వన్‌ ర్యాంకును దక్కించుకున్న కెర్బర్‌ ఆ ర్యాంకు దక్కించుకున్నవారిలో పెద్ద వయస్కురాు(28)గా నిలిచింది. స్టెపీగ్రాఫ్‌ తర్వాత నెంబర్‌వన్‌ ర్యాంకు సాధించడంతోపాటు యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన తొలి జర్మనీ అమ్మాయిగా కూడా ఆమె ఘనత సాధించింది. 

Monday, September 12, 2016

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లు గెలిచిన ప్లేయర్‌ సెరెనా విలియమ్స్‌ రికార్డు


ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లు (308) గెలిచిన ప్లేయర్‌గా సెరెనా విలియమ్స్‌ (అమెరికా) రికార్డు సృష్టించింది. గత రికార్డు రోజర్‌ ఫెదరర్‌ (307) పేరిట ఉంది. యూఎస్‌ ఓపెన్‌లో తాజాగా సెరెనా ఈ రికార్డు నమోదు చేసింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు


టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. శ్రీలంకలోని పల్లెకెలెలో ఆతిథ్య శ్రీలంకతో 2016 సెప్టెంబర్‌ 6న జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 263 పరుగు భారీ స్కోరు సాధించింది. లంక పేరిట ఉన్న 260/6 పరుగు రికార్డును అధిగమించింది. శ్రీలంక 178/9 పరుగులే చేసి ఓటమి పొందింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

రియో ఒలింపిక్స్‌-2016


బ్రెజిల్‌ రాజధాని రియో డిజెనీరోలో 2016 ఆగస్టు 5 నుంచి 21 వరకు 31వ వేసవి ఒలింపిక్‌ క్రీడలు జరిగాయి. వీటిని రియో ఒలింపిక్స్‌ అంటారు. ఈ ఒలింపిక్‌ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు ప్రధాన స్టేడియం (మారకానా స్టేడియం)లో జరిగాయి. అంత్జరాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ సమక్షంలో బ్రెజిల్‌ తాత్కాలిక అధ్యక్షుడు మిచెల్‌ తెమెర్‌ ఒలిం పిక్స్‌ ప్రారంభమైనట్లు ప్రకటించారు.

  • రియో ఒలింపిక్స్‌లో మొత్తం 28 క్రీడాంశాల్లో 306 ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు
  • 2012లో జరిగిన లండన్‌ ఒలింపిక్స్‌లో 26 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి
  • రియో ఒలింపిక్స్‌లో రగ్బీ సెవెన్స్‌ క్రీడను తొలిసారి ప్రవేశపెట్టారు
  • 112 సం॥ తర్వాత గోల్ఫ్‌ క్రీడను తిరిగి రియోలో పునఃప్రారంభించారు. 
  • ఒలింపిక్స్‌లో మొత్తం 207 దేశాలకు చెందిన క్రీడా బృందాలు వివిధ పోటీల్లో పాల్గొన్నాయి
  • రియో ఒలింపిక్స్‌ నినాదం - ఒక కొత్త ప్రపంచం
  • రియో ఒలింపిక్స్‌ మస్కట్‌ - వినిషియస్‌ 
  • ఆకుపచ్చరంగులో వివిధ జంతువుల ఆకృతులను కలిగిన ఈ చిహ్నం బ్రెజిల్‌ జంతు జీవవైవిధ్యానికి ప్రతీక
  • ప్రఖ్యాత బ్రెజిల్‌ సంగీతకారుడు దివంగత వినిషియస్‌ డిమొరెస్‌ జ్ఞాపకార్థం దీనికి ఆ పేరు పెట్టారు
  • 32వ ఒలింపిక్‌ క్రీడలు 2020లో జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్నాయి

రియో ముఖ్యాంశాలు

  • రియో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని అమెరికాకు చెందిన గిన్ని త్రాసర్‌ గెలుచుకుంది. ఈమె మహిళ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో పతకాన్ని సాధించింది. 
  • కోసోవో, దక్షిణ సూడాన్‌ దేశాు ఒలింపిక్స్‌లో మొదటిసారి పాల్గొన్నాయి
  • రియో ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్‌ స్వర్ణాన్ని నెయ్‌మార్‌ సారధ్యంలోని బ్రెజిల్‌ జట్టు గెలుపొందింది. పురుషుల హాకీ స్వర్ణాన్ని అర్జెంటీనా సాధించింది
  • పురుషుల 100 మీటర్ల పరుగు (స్ప్రింట్‌) పోటీలో జమైకాకు చెందిన ఉసెన్‌ బోల్డ్‌ స్వర్ణం సాధించాడు. ఇతడు 9.81 సెకన్లలో పరుగును పూర్తిచేశాడు. మహిళ 100 మీటర్ల పరుగును జమైకాకు చెందిన ఎలైనె థాంప్సన్‌ 10.71 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని సాధించింది
  • 400 మీ. పరుగులో దక్షిణాఫ్రికాకు చెందిన వేడ్‌ వాన్‌ నీకర్క్‌ 43.03 సెకన్లలో పూర్తి చేసి మైఖేల్‌ జాన్సన్‌ (అమెరికా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు(43.18 సెకన్లు)ను అధిగమించాడు
  • రియో ఒలింపిక్స్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ స్వర్ణాన్ని బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే గెలుపొందాడు. ముర్రేకు ఇది వరుసగా రెండో టెన్నిస్‌ ఒలింపిక్‌ స్వర్ణం. మహిళ సింగిల్స్‌ స్వర్ణాన్ని మోనికా ప్యూగ్‌ (ప్యూర్టోరికో)  గెలుపొందింది.
  • రియో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలను మైఖేల్‌ ఫెల్ప్స్‌ (స్విమ్మింగ్‌ : 5 స్వర్ణాలు, 1 రజతం), కెటీ లెడెకి (స్విమ్మింగ్‌ : 4 స్వర్గాలు, 1 రజతం), సైమన్‌ బైల్స్‌ (జిమ్నాస్టిక్స్‌ : 4 స్వర్ణాలు,  1 కాంస్యం) సాధించి 
  • మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ ముగ్గురూ అమెరికా క్రీడాకారులే.  గత మూడు ఒలింపిక్స్‌లో మూడు ఫార్మాట్ల (100 మీ., 200 మీ. 400 మీ. రిలే)లో స్వర్ణాలు నెగ్గి ట్రిపుల్‌ ట్రిపుల్‌ సొంతం చేసుకున్న తొలి అథ్లెట్‌గా ఉసెన్‌ బోల్డ్‌ నిలిచాడు
  • రియో ఒలింపిక్స్‌లోని ఆర్చరీ విభాగంలో దక్షిణకొరియా 4 స్వర్ణాలు గెలుపొంది ఈ ఘనత సాధించిన తొలి దేశంగా నిలిచింది
  • రియో ఒలింపిక్స్‌లో 121 పతకాలు సాధించిన అమెరికా పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగింది
  • 2012 లండన్‌ ఒలింపిక్స్‌లోకూడా అమెరికా 104 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది
  • రియో ఒలిపింక్స్‌లో 67 పతకాలు సాధించిన గ్రేట్‌ బ్రిటన్‌ 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో నిలిచాయి
  • 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 87 పతకాలతో చైనా 2వ స్థానంలో నిలిచింది
  • ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు అత్యధిక స్వర్ణాలు సాధించిన దేశంగా అమెరికా రికార్డు సృష్టించింది
  • రియో ఒలింపిక్స్‌లో 46 స్వర్ణాలు సాధించిన అమెరికా మొత్తంమీద వెయ్యికి పైగా (1022) స్వర్ణాలు గెలుచుకుంది
  • 31 వ ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశమైన బ్రెజిల్‌ 19 పతకాల (7,6,6) తో పతకాల పట్టికలో 13 వ స్థానంలో నిలిచింది
  • రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇండిపెండెంట్‌ ఒలింపిక్‌ అథ్లెట్లు ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో మొత్తం 2 పతకాలను సాధించారు
  • ఫె˜హైద్‌ ఆల్‌ దిహానీ షూటింగ్‌ మెన్స్‌ డబుల్‌ ట్రాప్‌ విభాగంలో స్వర్ణం సాధించి, బంగారు పతకం సాధించిన తొలి స్వతంత్ర ఆటగాడిగా నిలిచాడు
  • భారత్‌ ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం 2 పతకాలను సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది
  • రియో ఒలింపిక్స్‌లో మొత్తం 87 దేశాలు పతకాలుగెలుపొందాయి. 59 దేశాలు కనీసం ఒక బంగారు పతకాన్ని సాధించాయి. (ఇండిపెండెంట్‌ ఒలింపిక్‌ టీమ్‌తో కలిపి)
  • మహిళ 100 మీ. ఫ్రీస్టయిల్‌ ఈతలో ఒకే ఈవెంట్‌లో ఇద్దరికి పసిడి పతకాలను ప్రదానం చేశారు. పురుషుల 100 మీటర్ల బటర్‌ ఫ్లై ఈతలో ఒకే ఈవెంట్‌లో ముగ్గురికి రజత పతకాలను అందించారు
  • రియో ఒలింపిక్స్‌లో 307 స్వర్ణాలు, 307 రజతాలు, 360 కాంస్యాలతో మొత్తం 974 పతకాలను ప్రదానం చేశారు

రియోలో భారత్‌...
రియో ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున 121 మంది క్రీడాకారులు 15 క్రీడాంశాల్లో పాల్గొన్నారు

  • అథ్లెటిక్స్‌            36
  • హాకీ            32 
  • షూటింగ్‌            12 
  • రెజ్లింగ్‌             8 
  • బ్యాడ్మింటన్‌      7
  • ఆర్చరీ             4 
  • టెన్నిస్‌             4 
  • టేబుల్‌ టెన్నిస్‌     4 
  • బాక్సింగ్‌             3 
  • గోల్ఫ్‌                     3
  • వెయిట్‌లిఫ్ట్టింగ్‌     2 
  • స్విమ్మింగ్‌             2 
  • జిమ్నాస్టిక్స్‌     1
  • రోయింగ్‌             1
  • జూడో                     1
  • రియో ఒలింపిక్స్‌లో భారత్‌ ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం 2 పతకారులు  సాధించి, పతకాల పట్టికలో 67 వ స్థానంలో నిలిచింది.
  • 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 6 పతకాలు (0, 2, 4)తో 55వ స్థానంలో నిలిచింది
  • రియో ఒలిపింక్స్‌  ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి అభినవ్ బింద్రా, ముగింపు వేడుకల్లో సాక్షి మాలిక్‌ నాయకత్వం వహించారు
  • భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్‌ ఫైనల్లో 1-3 తో బెల్జియం చేతిలో ఓడి, రియో ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది

ఒలింపిక్స్‌ ప్రస్థానం...


  • అంతర్జాతీయ క్రీడా ఉత్సవాల్లో ఒలింపిక్స్‌ ప్రధానమైనవి
  • వీటిని క్రీ.పూ.776క్రీ.శ.393 మధ్య తొలిసారిగా నిర్వహించారు
  • బరాన్‌ ఫియర్రీ డీ కౌబర్టిన్‌ (ఫ్రాన్స్‌) కృషి వల్ల వీటిని మళ్లీ 1896లో పునఃప్రారంభించారు. వీటినే ఆధునిక ఒలింపిక్‌ క్రీడలు అంటారు
  • కౌబర్టిన్‌ను ఆధునిక ఒలింపిక్స్‌ పితామహుడిగా పేర్కొంటారు
  • ఒలింపిక్‌ క్రీడల నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీని 1894 జూన్‌ 23న ఏర్పాటు చేశారు
  • అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ మొదటి అధ్యక్షుడు - డెమిట్రి యస్‌ వికిలాస్‌
  • అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు - థామస్‌ బాక్‌ 

  • అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రధాన కార్యాయం స్విట్టర్లాండ్‌లోని లుసానేలో ఉంది

  • ఒలింపిక్‌ క్రీడలను ప్రతి 4 సం॥కు ఒకసారి నిర్వహిస్తారు
  • 1896లో గ్రీసు రాజధాని ఎథెన్స్‌లో మొట్టమొదటి ఒలింపిక్‌ క్రీడలను నిర్వహించారు
  • ఒలింపిక్స్‌ పతాకం మధ్యలో 5 వివిధ రంగులతో కూడిన 5 వలయాలు ఉంటాయి. ఇవి ప్రపంచంలోని ఖండాలకు ప్రతీక
  • ఒలింపిక్‌ క్రీడల విజేతకు 3 రకాల పతకాలు (స్వర్ణం, రజతం, కాంస్యం)ను ప్రదానం చేస్తారు
  • ఇప్పటివరకు ఆఫ్రికా ఖండంలో ఒలింపిక్స్‌ నిర్వహించలేదు
  • మొదటి, రెండో ప్రపంచ యుద్దాల కారణంగా 1916, 1940, 1944 సంవత్సరాల్లో ఒలింపిక్స్‌ నిర్వహించలేదు
  • 1900లో పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తొలిసారిగా పాల్గొంది
  • భారత్‌ ఇప్పటివరకు మొత్తం 28 ఒలింపిక్స్‌ పతకాలను సాధించింది.
  • స్వర్ణాలు 9
  • రజతాలు 7
  • కాంస్యాలు 12
  • వీటిలో 11 (8 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు) పతకాలు హాకీ క్రీడలో లభించాయి
  • వ్యక్తిగత విభాగంలో భారత్‌ తరపున ఏకైక స్వర్ణాన్ని 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటర్‌ అభినవ్‌ బింద్రా సాధించారు
  • 15వ పారా ఒలింపిక్స్‌ క్రీడలు
  • 2016 సెప్టెంబరు 7 నుంచి 18 వరకు బ్రెజిల్‌ రాజధాని రియోడిజెనిరోలో జరిగాయి
  • వీటిని దివ్యాంగ క్రీడాకారు కోసం వేసవి ఒలింపిక్స్‌ జరిగిన కొన్నిరోజుకు అదే క్రీడా వేదికల్లో నిర్వహిస్తారు
  • రియో పారా ఒలింపిక్స్‌ క్రీడల్లో 176 దేశాు, 23 క్రీడల్లోని 528 ఈవెంట్స్‌లో పాల్గొంటాయి
  • రియో పారా ఒలింపిక్స్‌ మస్కట్‌ - టామ్‌

సాక్షి మాలిక్‌




  • రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన  క్రీడాకారిణి సాక్షి మాలిక్‌
  • ఈమె రెజ్లింగ్‌ మహిళ ఫ్రీస్టైల్‌ (58 కేజీు) విభాగంలోని రెపిఛేజ్‌ రౌండ్‌లో కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన ఐసు టినిటెకోవాపై 8-5తో విజయం సాధించి, కాంస్య పతకాన్ని గెలుపొందింది 
  • హర్యానాకు చెందిన సాక్షి మాలిక్‌ ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో భారత్‌ తరపున పతకం సాధించిన తొలి మహిళ
  • సాక్షి మాలిక్‌కు భారత ప్రభుత్వం 2016 సంవత్సరానికి రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాన్ని అందించింది

పీవీ సింధు




  • భారత క్రీడాకారిణి పి.వి. సింధు బ్యాడ్మింటన్‌ మహిళ సింగిల్స్‌ ఫైనల్లో కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయింది
  • 21-19, 12-21, 15-21 తేడాతో రెండో స్థానంలో నిలిచిన సింధు రజత పతకాన్ని సాధించింది
  • ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత మహిళ పి.వి. సింధు 
  • స్వాతంత్య్రానంతరం భారత్‌కు ఇది 4వ వ్యక్తిగత రజత పతకం. గత విజేతలు రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ (2004 ఎథెన్స్‌ ఒలింపిక్స్‌), సుశీల్‌ కుమార్‌, విజయ్‌ కుమార్‌ (2012 లండన్‌ ఒలింపిక్స్‌), స్వాతంత్య్రానికి ముందు జరిగిన 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో నార్మన్‌ పిచర్డ్‌ 200 మీటర్ల పరుగులో 2 రజత పతకాలను సాధించాడు
  • ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ, తెలుగు మహిళ కరణం మల్లీశ్వరి (2000 సిడ్నీ ఒలింపిక్స్‌ - వెయిట్‌ లిఫ్టింగ్‌‌)
  • ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో తెలుగమ్మాయి సింధు
  • మొత్తంమీద ఒలింపిక్స్‌లో పతకం సాధించిన 5వ భారత మహిళ సింధు
          1. కరణం మల్లీశ్వరి
          2. సైనా నెహ్వాల్‌
          3. మేరీకోమ్‌
          4. సాక్షిమాలిక్‌
          5. పి.వి. సింధు
  • పి.వి. సింధు భారత ప్రభుత్వం నుంచి 2013 లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ పురస్కారం, 2016 సం॥నికి రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకుంది

దీపా కర్మాకర్‌ 




  • త్రిపురకు చెందిన మహిళా జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ రియో ఒలింపిక్స్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ మహిళ వాల్ట్‌ విభాగంలో ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. కానీ, 0.15 పాయింట్ల తేడాతో పతకాన్ని కోల్పోయి 4 వ స్థానంలో నిలిచింది.
  • దీప ఫైనల్‌లో అత్యంత ప్రమాదకర విన్యాసమైన ప్రొడునోవాను ప్రదర్శించింది
  • దీప 2014 గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుపొందింది. జిమ్నాస్టిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా గుర్తింపు  పొందింది
  • భారత ప్రభుత్వం దీపా కర్మాకర్‌ను 2016 సంవత్సరానికి రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారంతో సత్కరించింది

లలిత బాబర్‌




  • భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో (గత 36 సంవత్సరాల్లో) ఒలింపిక్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో ఫైనల్‌ చేరిన తొలి భారత మహిళగా లలిత బాబర్‌ ఘనత సాధించింది
  • లలిత బాబర్‌ 3000 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే బాబర్‌ ఫైనల్లో 10 వ స్థానంలో నిలిచింది
  • 1984లో 400 మీటర్ల హర్డిల్స్‌లో పీటీ ఉష ఫైనల్‌కు చేరింది

అభినవ్‌ బింద్రా




  • బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన షూటర్‌ అభినవ్‌ బింద్రా రియో ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలిచాడు

జీతూరాయ్‌ 


  • రియో ఒలింపిక్స్‌లో పురుషు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ జీతూరాయ్‌ 8వ స్థానంలో నిలిచాడు. ఇతడిని భారత ప్రభుత్వం 2016 సంవత్సరానికి రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారంతో సత్కరించింది

పతకాల పట్టిక (తొలి పది స్థానాలు)
దేశం                      స్వర్ణం     రజతం కాంస్యం మొత్తం
1. అమెరికా      46      37 38         121
2. బ్రిటన్‌              27      23 17         67
3. చైనా              26     18 19         56
4. రష్యా              19     18 19         56
5. జర్మనీ              17     10 15         42
6. జపాన్‌              12      8         21         41
7. ఫ్రాన్స్‌              10     18 14         42
8. కొరియా               9      3         9         21
9. ఇటలీ               8     12 8         28
10. ఆస్ట్రేలియా       8     11        10         29
67. భారత్‌       0     1        1         2

  • పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నివడం ఇది వరుసగా రెండోసారికాగా, మొత్తంగా ఇది 17వ సారి
  • ఫిజి (రగ్బీ), జోర్దాన్‌ (త్కెక్వాండో), కొసావో (జూడో) తొలిసారి ఒలింపిక్స్‌ పతకాలు గెలిచాయి
  • ఆర్చరీలోని 4 స్వరాలను దక్షిణ కొరియా గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి దేశం కొరియానే.
  • రియో ఒలింపిక్స్‌లో పోటీపడిన మొత్తం క్రీడాకారులు 11,303. వీరిలో 45 శాతం మహిళలు ఉన్నారు
  • ఒలింపిక్స్‌ డైవింగ్‌లో వు మింక్సియా 5 స్వర్ణాలు సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి డైవర్‌ వు మింక్సియా 
  • స్ప్రింట్‌, పరుగు పోటీల్లో ట్రిపుల్‌ ట్రిపుల్‌ (9 స్వర్ణాలు) సాధించిన ఉసేన్‌ బోల్ట్‌, ఈత కొలనులో మరెవరికీ, ఎప్పటికీ సాధ్యం కాదేమోనన్న రీతిలో 23 పసిడి పతకాతో సంచలనం సృష్టించిన మైకేల్‌ ఫెల్ప్‌ు రియోతో ఒలింపిక్స్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు
  • రియో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన రగ్బీ సెవెన్స్‌లో ఫిజి ఏకంగా స్వర్ణాన్ని గెలిచింది. ఆ దేశ ఒలింపిక్‌ చరిత్రలో ఇదే తొలి పసిడి
  • టెన్నిస్‌లో మోనిక ఫ్యూగ్‌ మహిళ సింగిల్స్‌ స్వర్ణం గెలిచి ప్యూర్టోరికోకు తొలి స్వర్ణాన్ని అందించింది

Sunday, September 11, 2016

2016 జాతీయ క్రీడా అవార్డులు


2016 సం॥నికి గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పి.వి.సింధుకు దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్‌ ఖేల్‌రత్న దక్కింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఇదే ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన కుస్తీ యోధురాలు సాక్షిమాలిక్‌, త్రుటిలో పతకం చేజారినా.. అద్భుత విన్యాసాలతో అబ్బురపర్చిన జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, షూటింగ్‌లో నిలకడ ప్రదర్శనతో ఆకట్టుకున్న జీతూరాయ్‌కు కూడా కేంద్రం ఖేల్‌రత్న ప్రకటించింది. దేశ క్రీడా పురస్కారాల చరిత్రలో తొలిసారి నలుగురు క్రీడాకారులకు ఒకేసారి ఖేల్‌రత్న ప్రకటించింది. 2016 సం॥నికి గాను క్రీడా మంత్రిత్వశాఖ ఖేల్‌రత్నతోపాటు ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్‌చంద్‌ పురస్కారాలను కూడా ప్రకటించింది.

రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు :
క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో నాలుగేళ్లు అత్యంత అద్భుత ప్రదర్శన చేసిన వారికి ఖేల్‌రత్న పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.7 లక్షల నగదును అందజేస్తారు.
విజేతలు

1. పి.వి.సింధు             బ్యాడ్మింటన్‌
2. సాక్షిమాలిక్‌             రెజ్లింగ్‌
3. దీపా కర్మాకర్‌             జిమ్నాస్టిక్స్‌
4. జీతూరాయ్‌             షూటింగ్‌




ద్రోణాచార్య అవార్డు :
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పోటీల్లో పతక విజేతను తయారుచేసిన శిక్షకులకు ద్రోణాచార్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పురస్కార విజేతకు ప్రతిమ, సర్టిఫికెట్లు, రూ.5 లక్షల చొప్పున నగదును అందజేస్తారు.
విజేతలు
1. నాగపురి రమేష్‌               అథ్లెటిక్స్‌
2. సాగర్‌ మాల్‌ దయాళ్‌      బాక్సింగ్‌
3. రాజ్‌కుమార్‌ శర్మ       క్రికెట్‌-విరాట్‌ కొహ్లీ గురువు
4. బిశ్వేశ్వర్‌ నంది           జిమ్నాస్టిక్‌ - దీపా కర్మాకర్‌ గురువు
5. ఎస్‌. ప్రదీప్‌ కుమార్‌       ఈత, జీవితకాలం
6. మహబీర్‌ సింగ్‌               కుస్తీ, జీవితకాలం
నాగపురి రమేష్‌

https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

అర్జున అవార్డు :
నాలుగేళ్లపాటు నికడగా ప్రతిభను కనబర్చిన వారికి అర్జున పురస్కారాన్ని అందజేస్తారు. పురస్కార విజేతలకు ప్రతిమ, సర్టిఫికెట్లు, రూ.5 లక్షల చొప్పున నగదును అందజేస్తారు.
విజేతలు
1. రజత్‌ చౌహాన్‌       ఆర్చరీ
2. లితా బాబర్‌       అథ్లెటిక్స్‌
3. సౌరవ్‌ కొథారీ      బిలియర్డ్స్‌, స్నూకర్‌
4. శివ ధాపా               బాక్సింగ్‌
5. అజింక్య రహానే      క్రికెట్‌
6. సుచిత్ర పాల్‌              ఫుట్‌బాల్‌
7. రాణి                              హాకీ
8. వి.ఆర్‌.రఘునాథ్‌      హాకీ
9. గురుప్రీత్‌సింగ్‌              షూటింగ్‌
10. అపూర్వీ చండేలా      షూటింగ్‌
11. సౌమ్యజిత్‌ ఘోష్‌      టేబుల్‌ టెన్నిస్‌
12. వినేష్‌                      కుస్తీ
13. అమిత్‌ కుమార్‌      కుస్తీ
14. సందీప్‌ సింగ్‌ మాన్‌      పారా అథ్లెటిక్స్‌
15. వీరేంద్ర సింగ్‌              కుస్తీ, బధిర

ధ్యాన్‌చంద్‌ అవార్డు :
క్రీడల అభివృద్ధికి జీవితకాలం  కృషిచేసిన వారికి ధ్యాన్‌చంద్‌ పురస్కారాన్ని అందజేస్తారు. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ పురస్కార విజేతలకు ప్రతిమ, సర్టిఫికెట్లు, రూ.5 లక్షల  చొప్పున నగదును అందజేస్తారు.
విజేతలు
1. సత్తి గీత                                  అథ్లెటిక్స్‌
2. స్వినస్‌ డంగ్‌డంగ్‌                 హాకీ
3. రాజేంద్ర ప్రల్‌హాద్‌షెల్కె   రోయింగ్‌

సత్తి గీత

భారత అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేష్‌, భారత మాజీ అథ్లెట్‌, ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(SAAP) డైరెక్టర్‌ సత్తి గీత ఇద్దరూ తెలుగువారు.
SAAP-Sports Authority of Andhra Pradesh

Saturday, September 3, 2016

ప్రొ కబడ్డీ మహిళ విజేత స్ట్రామ్‌ క్వీన్స్‌


తొలిసారి నిర్వహించిన ప్రొ కబడ్డీ లీగ్‌ మహిళ టోర్నీలో స్ట్రామ్‌ క్వీన్స్‌ విజేతగా నిలిచింది. 2016 జూలై 31న జరిగిన ఫైనల్లో ఫైర్‌ బర్డ్స్‌పై విజయం సాధించింది.

ప్రొ కబడ్డి లీగ్‌ విజేత పట్నా పైరేట్స్‌


ప్రొ కబడ్డీ సీజన్‌-4 విజేతగా పట్నా పైరేట్స్‌ నిలిచింది. దీంతో రెండోసారి టైటిల్‌ చేజిక్కించుకున్న తొలి జట్టుగా పట్నానిలిచింది. 2016 జూలై 31న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్లో పైరేట్స్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ను ఓడిరచింది

Friday, September 2, 2016

అభిజిత్‌, తానియాలకు కామన్వెల్త్‌ టైటిల్స్‌


కామన్వెల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు  ఓపెన్‌, మహిళా విభాగాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. కొలంబోలో 2016 ఆగస్టు 7న ముగిసిన టోర్నమెంట్లో ఓపెన్‌ కేటగిరీలో అభిజిత్‌ గుప్తా విజేతగా నిలవగా, ఎస్‌.ఎల్‌.నారాయణ్‌, దీపన్‌ చక్రవర్తిలు వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. మహిళా విభాగంలో తానియా సచ్‌దేవ్‌ అగ్రస్థానంలో నిలిచి తొలిసారి స్వర్ణం సాధించగా, మెరీ ఆన్‌ గోమ్స్‌ రజతం, కిరణ్‌ మనీషా మొహంతి కాంస్య పతకాలను దక్కించుకున్నారు.

Tuesday, August 23, 2016

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ముత్తయ్య మురళీధరన్‌


శ్రీంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం  లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలో మురళీధరన్‌కు చోటు దక్కింది. ఈ జాబితాలో చోటు సాధించిన తొలి శ్రీలంక ఆటగాడిగా ముత్తయ్య మురళీధరన్‌ ఘనత సాధించాడు.

ICC - International Cricket Council

Tuesday, August 16, 2016

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఖేలో ఇండియా క్రీడా పోటీలు


రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువత కోసం జరిగే దేశవ్యాప్త క్రీడా పోటీలను ప్రధాని నరేంద్రమోడి డిజిటల్‌ విధానంలో 2016 జులై 23న  డిల్లీలో ప్రారంభించారు. ఇవి పాఠశాలలు, కళాశాలల  స్థాయిలో వేర్వేరు నగరాల్లో జరిగే అతిపెద్ద జాతీయ పోటీలు . ఖేలో ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అనుగుణంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేపట్టిన పోటీ కార్యక్రమంలో భాగంగా తొలి ఏడాది 8 నగరాల్లో ఫుట్‌బాల్‌ పోటీలు  నిర్వహిస్తారు. వివిధ క్రీడల్లో ప్రతిభావంతుల్ని గుర్తించి, వారికి స్కాలర్ షిప్ లు  అందిస్తుంది. దీని నిమిత్తం రిల యన్స్‌ ఫౌండేషన్‌ ఆరుగురు సభ్యుతో సలహా మండలి ఏర్పాటు చేసింది. దీనిలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీతో పాటు సచిన్‌ టెందుల్కర్ , లియాండర్‌పేస్‌, సైనా నెహ్వాల్‌ తదితరులున్నారు.