- బ్యాకప్ చేయకుండానే వాట్సప్‌లోని చాట్ హిస్టరీని కొత్త స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం వాట్సప్ చాట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి.
- క్లౌడ్ ఆధారంగా పనిచేసే బ్యాకప్ కంటే ఈ ప్రక్రియ చాలా వేగంగానూ, సులభంగానూ ఉంటుంది. ఇందుకోసం రెండు (పాత, కొత్త) ఫోన్లూ మీ వద్దే ఉండాలి. అవి రెండు ఒకే వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండడంతో పాటు, లొకేషన్ సర్వీసు కూడా ఆన్‌లో ఉంచాలి.
బదిలీ ఇలా..
- ముందు మీ పాత ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- చాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో చాట్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- చాట్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రక్రియ మీ పాత ఫోన్‌లో ప్రారంభం అవుతుంది. ఇక్కడో క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ అవుతుంది.
- తర్వాత కొత్త ఫోన్‌లో వాట్సప్ ఇన్‌స్టాల్ చేయాలి. అదే ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
- పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్ కోడ్‌ను కొత్త దాంట్లో ఎంటర్ చేయాలి.
- కొత్త ఫోన్‌లో చూపించే క్యూఆర్ కోడ్‌ను పాత ఫోన్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్ చేయాలి.
- ఆ తర్వాత పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి బదిలీ అవుతుంది.
- కొన్ని నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రక్రియ సమయంలో రెండు ఫోన్లూ పక్కపక్కనే ఉంచాలి. స్క్రీన్‌లూ ఆన్‌లోనే ఉంచాలి.
No comments:
Post a Comment