- సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని నరేంద్రమోదీ 2024 జనవరి 28న ఢల్లీిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నూతన వెబ్‌సైట్‌తోపాటు, డిజిటల్ రికార్డులు, డిజిటల్ కోర్ట్స్-2.0ను ఆవిష్కరించారు.
- ప్రస్తుతం న్యాయ వ్యవస్థకు ఇబ్బందికరంగా మారిన 4 అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు. ‘అవి 1. కేసుల వాయిదాల నుంచి బయటపడి న్యాయ స్థానాల్లో వృత్తి నైపుణ్య సంస్కృతిని నెలకొల్పడం. 2. న్యాయస్థానాల తీర్పులు జాప్యమయ్యేలా చేస్తూ, న్యాయ వ్యవస్థలను శక్తిమంతమైన వ్యక్తులు తమ గుప్పిట్లో ఉంచుకునే విధంగా వాదనలు సుదీర్ఘంగా సాగకుండా చూడటం. 3. తొలి తరం న్యాయవాదులకూ సమాన అవకాశాలు కల్పించడం. 4. సుదీర్ఘ సెలవులపై చర్చించి ప్రత్యామ్నాయంగా న్యాయవాదులు, న్యాయమూర్తులకు అనువైన సమయంలో పని చేసే అంశంపై ఒక నిర్ణయానికి రావడం’ అని పేర్కొన్నారు.
- భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ పడిలోకి అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని 2024 జనవరి 28న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు.
Showing posts with label Court Judgements. Show all posts
Showing posts with label Court Judgements. Show all posts
Monday, January 29, 2024
Supreme Court : సుప్రీంకోర్టు వజ్రోత్సవాల ప్రారంభం
ఉద్యోగం లేకపోయినా.. మనోవర్తి చెల్లించాల్సిందే
- విడాకుల విషయంలో అందించే మనోవర్తికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగం లేకున్నా విడిపోయిన భార్యకు భరణం ఇవ్వడం భర్త బాధ్యత అని స్పష్టంచేసింది.
- ఈ కేసులో భర్తకు కూలీగా పనిచేసే సామర్థ్యం ఉందని.. అలా పనిచేసైనా మనోవర్తి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. తనకు ఉద్యోగం లేనందున భరణం చెల్లించలేనన్న భర్త వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దంపతులకు 2015లో వివాహమైంది. వరకట్నం కోసం భర్త, ఆయన కుటుంబీకులు వేధిస్తున్నారంటూ పెళ్లైన కొన్ని రోజులకే పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. 2016లో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. విడిపోయిన భార్యకు మనోవర్తి కింద నెలకు రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ అతడు ఫిబ్రవరి 21, 2023లో హైకోర్టును ఆశ్రయించాడు.
- తన భార్య ఉపాధ్యాయురాలిగా నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నారనే విషయాన్ని ప్రిన్సిపల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టులో వాదించాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పాడు. అద్దె నివాసంలో ఉంటున్న తనపై తల్లిదండ్రులు, సోదరీమణులు ఆధారపడ్డారని విన్నవించాడు. భార్య ఉద్యోగం చేస్తున్న విషయాన్ని కోర్టు ముందు రుజువు చేయలేకపోయాడు. ఇరువర్గాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్‌కు చెందిన జస్టిస్ రేణు అగర్వాల్.. అతడి వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. ఉద్యోగం లేకపోయినప్పటికీ భార్యకు మనోవర్తి చెల్లించాలని స్పష్టం చేశారు.
Wednesday, May 27, 2020
Supreme Court’s suo motu cognisance of Migrant Workers’ plight
On May 26, 2020, a three-judge bench of the Supreme Court took suo motu cognisance of migrant workers issue and noted that there have been “inadequacies and certain lapses” on the part of the Central and State governments in dealing with the migrant workers crisis during the lockdown.
What is suo moto cognisance?
- Suo motu is a latin phrase which means “on its own”.
- This means that the court has taken the matter into cognisance on its own and without any plaintiff.
- A plaintiff is a person or entity which files a case or petition in the court.
- Normal court cases need a plaintiff and a defendant, while in suo moto, there is no plaintiff.
- In the current matter, the court has taken suo motu cognisance on the basis of newspaper and media reports on helpless migrants forced to travel thousands of miles on foot or cycles.
Supreme Court Directions
- The three judge bench of the Supreme Court headed by Justice Ashok Bhushan has ordered the centre and states to immediately provide transport, food and shelter free of cost to the stranded migrant workers.
- The court has also asked Solicitor-General Tushar Mehta to inform the court by May 28, 2020 about the measures taken by the Centre to alleviate the migrants’ sufferings.
What is next?
- The court has issued formal notice to the centre, states and Union Territories to file their responses by May 28.
Thursday, April 23, 2020
SC on anti-narcotics law: Quantity will determine punishment not Purity
On April 23, 2020, the Supreme Court of India pronounced that it is the quantity of the banned drug mixture that will decide the punishment of the offender and not the purity. The clarification was given by the apex court under the Narcotic Drugs and Psychotropic Substances Act.
Highlights
In order to determine whether the drugs are in “small or commercial quantity”, the neutral substance in the mixture is to be included along with actual weight. This is being clarified by the court as according to the Narcotics Drugs and Psychotropic Substances act, the punishment for possessing commercial quantity of drugs is more than that of smaller quantity.
What is the issue?
In illegal drug markets, the drugs are adulterated or mixed with other substances. This is done to reduce the vaporizing rates of heroin. They add chalk powder, zinc oxides and other cheaper but more dangerous impurities.
Narcotics Drugs and Psychotropic Act, 1985
The act prohibits a person to manufacture, produce, cultivate, possess, purchase, store, transport or consume narcotic drugs. Under the act, the GoI can constitute Narcotic Drugs and Psychotropic Substances Consultative Committee to provide advise on matters relating to administration of the act. The committee shall consist of maximum of 20 members.
Under the act, the GoI shall constitute National Fund to control drug abuse.
Thursday, October 6, 2016
మద్య నిషేధం పిల్ పరిశీనకు సుప్రీంకోర్టు తిరస్కరణ
దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) పరిశీలించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్యాంగం ప్రకారం జాతీయ మద్యం విధానం అనేది ఆదేశిక సూత్రాల్లో భాగమని, ఇందులో కార్యనిర్వాహక వర్గానికి అన్ని హక్కులు ఉన్నాయని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎన్‌వీ రమణతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ పిల్‌ను పరిశీలించలేమని స్పష్టం చేసింది. దీంతో పిల్‌ను దాఖలు చేసిన న్యాయవాది, ఢల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్ దాన్ని ఉపసంహరించుకున్నారు.
Wednesday, October 5, 2016
భారత్‌పై ‘మార్షల్స్ అణ్వాయుధ కేసు’ తిరస్కరణ
‘అణ్వాయుధ పోటీ’ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ.. భారత్‌తోపాటు పాకిస్థాన్, బ్రిటన్‌లపై మార్షల్ ఐలాండ్స్ పెట్టిన ‘చరిత్రాత్మక కేసు’ను ఐక్యారాజ్య సమితి అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై 16 మంది న్యాయమూర్తులతో కూడిన అంతర్జాతీయ న్యాయస్థాన (ఐసీజే) ట్రైబ్యునల్ 2016 అక్టోబర్ 5న విచారణ చేపట్టింది. ‘భారత్, పాక్, బ్రిటన్‌లతో మార్షల్ ఐలాండ్‌కు పాత వివాదాలున్నట్లు సాక్ష్యాలేమీ కనిపించడం లేదు. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోండి’అని ట్రైబ్యునల్‌కు నేతృత్వం వహించిన న్యాయమూర్తి రోనీ అబ్రహాం తీర్పునిచ్చారు. అంతేకాదు భారత్, పాక్, బ్రిటన్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఆయన మద్దతు పలికారు. తీర్పు వెలువడిన అనంతరం.. దీనిలోని అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తామని మార్షల్స్ తరఫున న్యాయవాది ఫోన్ వాన్ డెర్ బీసెన్ తెలిపారు. ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం లేదు. మార్షల్ ఐలాండ్స్‌కు చెందిన ప్రిస్టైన్ అటాల్స్ ప్రాంతంలో 1946-58 మధ్య కాలంలో అమెరికా విధ్వంసకర అణు పరీక్షలను నిర్వహించింది. దీంతో ఈ పసిఫిక్ ద్వీప దేశంలోని పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వేల ఏళ్లపాటు నివాసయోగ్యానికి పనికిరాకుండా మారిపోయాయి. దీంతో అణు బాంబుల సమీకరణను అడ్డుకునేందుకు సిద్ధంచేసిన అణ్వస్త్రాల నిరోధక ఒప్పందం-1968కు అన్ని దేశాలూ కట్టుబడి ఉండాలని మార్షల్స్ పట్టుబట్టింది. అనంతరం 2014లో ఈ ఒప్పందంలోని అంశాలను ఆచరణలో పెట్టడంలో విఫలమయ్యాయంటూ 9 దేశాలకు వ్యతిరేకంగా ఐసీజేను ఆశ్రయించింది.
Tuesday, September 20, 2016
సింగూరు భూమి రైతులకిచ్చేయండి : సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్‌లోని సింగూరు భూసేకరణను సుప్రీంకోర్టు 2016 ఆగస్టు 31న కొట్టేసింది. మొత్తం 1053 ఎకరాల భూమిపై హక్కులను 12 వారాల్లోగా రైతులకు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో రైతులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాన్ని వెనక్కి తీసుకోరాదని, 10 సం॥ పాటు రైతు భూమికి దూరంగా ఉన్నందున ఆ మొత్తం రైతుకే చెందుతుందని తీర్పు చెప్పింది. టాటా సంస్థ నానో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు కోసం పదేళ్ల కిందట అప్పటి వామపక్ష ప్రభుత్వం సింగూరులో భూసేకరణ చేసింది.
Friday, September 9, 2016
FIRను 24 గం॥ల్లో ఆన్‌లైన్‌లో ఉంచాలి : సుప్రీం
పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన 24 గంటల్లో ప్రథమ సమాచార నివేదిక(FIR)ను ఆన్‌లైన్‌లో ఉంచాని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇంటర్నెట్ సౌకర్యం సరిగా విస్తరించని రాష్ట్రాలకు 72 గంటల గడువును నిర్దేశించింది. సాయుధ పోరాటాలు, మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల FIRను ఇంటర్నెట్‌లో పెట్టాల్సిన పనిలేదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సి.నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం మినహాయింపు నిచ్చింది.
FIR-First Information Report
Saturday, September 3, 2016
ఢిల్లిలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్
దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ 2016 ఆగస్టు 12న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే 2000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ రిజిస్ట్రేషన్‌కు పర్యావరణ పరిరక్షణ సెస్ కింద 1 శాతం ప్రత్యేక రుసుమును సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకు చెల్లించాలని తెలిపింది.
Saturday, August 27, 2016
తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషకు ప్రాచీన హోదాపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. భాషకు ప్రాచీన హోదా కల్పించే విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ప్రథమ ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
Friday, August 26, 2016
Wednesday, August 24, 2016
పాల కల్తీపై కఠినంగా వ్యవహరించాలి : సుప్రీం
పాలు, పాల ఉత్పత్తులను కల్తీ చేసేవారికి గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకురావాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టాన్ని సవరించడం, కల్తీకి పాల్పడటాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చడం లాంటి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పాల కల్తీ నేరానికి పాల్పడేవారికి గరిష్ట జైలుశిక్షను జీవిత ఖైదుకు పెంచుతూ పశ్చిమ్‌బంగా, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఐపీసీలో సవరణలు తీసుకురావడాన్ని ప్రస్తావించింది.
Subscribe to:
Posts (Atom)











