Wednesday, August 24, 2016

పాల కల్తీపై కఠినంగా వ్యవహరించాలి : సుప్రీం


పాలు, పాల ఉత్పత్తులను కల్తీ చేసేవారికి గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకురావాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టాన్ని సవరించడం, కల్తీకి పాల్పడటాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చడం లాంటి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పాల కల్తీ నేరానికి పాల్పడేవారికి గరిష్ట జైలుశిక్షను జీవిత ఖైదుకు పెంచుతూ పశ్చిమ్‌బంగా, ఒడిశా లాంటి రాష్ట్రాలు ఐపీసీలో సవరణలు తీసుకురావడాన్ని ప్రస్తావించింది.

No comments:

Post a Comment