Tuesday, September 20, 2016

సింగూరు భూమి రైతులకిచ్చేయండి : సుప్రీంకోర్టు


పశ్చిమ బెంగాల్‌లోని సింగూరు భూసేకరణను సుప్రీంకోర్టు 2016 ఆగస్టు 31న కొట్టేసింది. మొత్తం 1053 ఎకరాల భూమిపై హక్కులను 12 వారాల్లోగా రైతులకు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో రైతులకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాన్ని వెనక్కి తీసుకోరాదని, 10 సం॥ పాటు రైతు భూమికి దూరంగా ఉన్నందున ఆ మొత్తం రైతుకే చెందుతుందని తీర్పు చెప్పింది. టాటా సంస్థ నానో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు కోసం పదేళ్ల కిందట అప్పటి వామపక్ష ప్రభుత్వం సింగూరులో భూసేకరణ చేసింది.

No comments:

Post a Comment