Monday, August 22, 2016

హిరోషిమాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఎవరు..?


జపాన్‌లోని హిరోషిమాపై అణుబాంబు దాడికి 2016 ఆగస్టు 6 నాటికి 71 సం॥లు పూర్తయ్యాయి. ఈ అణుబాంబు సృష్టించిన బీభత్సానికి వేలాది మంది జపాన్‌ వాసులు ప్రాణాలు కోల్పోయారు. 1945 ఆగస్టు 6హిరోషిమాపై బి-29 బాంబర్‌ నుంచి తొలి అణుబాంబు లిటిల్‌ బాయ్‌ను అమెరికా వదిలింది. 1945 ఆగస్టు 9నాగసాకిపై బి-29 బాంబర్‌ నుంచి అణుబాంబు ఫ్యాట్‌ బాయ్‌ను అమెరికా వదిలింది. హిరోషిమాపై దాడితో 1,40,000 మంది, నాగసాకిపై దాడితో 70,000 మంది మరణించారు. 2016 మే 27న అమెరికా అధ్యక్షుడు ఒబామా హిరోషిమాను సందర్శించి అణుబాంబు మృతులకు నివాళులు అర్పించాడు. హిరోషిమాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామా. 


No comments:

Post a Comment