తమిళనాడులో అతిపెద్ద సోలార్ పవర్‌ప్లాంట్
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటును 648 మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో అదాని గ్రూపు తమిళనాడులో నిర్మించింది. రామనాథపురం జిల్లాలోని కముధి వద్ద ఈ సోలార్ ప్లాంటును 2016 సెప్టెంబర్ 21 న ప్రారంభించారు. సబ్‌స్టేషన్ ద్వారా దీనిని గ్రిడ్‌కు అనుంసంధానిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారికంగా ప్రారంభించారు. 5వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.4,550 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. నిర్మాణానికి కావాల్సిన పరికరాలు, యంత్రాలను వివిధ దేశాల నుంచి సమకూర్చి 8 నెలల్లో ప్లాంటును పూర్తి చేశారు. నిర్దిష్ట సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకి 8,500 మంది కార్మికులు పని చేశారు. ఈ ప్లాంటు 3.8 లక్షల ఫౌండేషన్లు, 25లక్షల సోలార్ మాడ్యూల్స్, 576 ఇన్వర్టర్లు, 154 ట్రాన్స్‌ఫార్మర్లు, 6వేల మీటర్ల పొడవు గల కేబుల్స్‌ను కలిగి ఉంది.
No comments:
Post a Comment