Monday, August 29, 2016

బంగాళాఖాతంలో సహజ వాయువు నిల్వలు


బంగాళాఖాతంలో సహజ వాయువు నిల్వలు బయటపడ్డాయి. గ్యాస్‌హైడ్రేట్ల రూపంలో ఉన్న ఈ నిల్వల ను కృష్ణా-గోదావరి బేసిన్‌లో భారత్‌, అమెరికా సంయుక్త అన్వేషణ ద్వారా గుర్తించాయి. వీటి నుంచి సహజ వాయువులను ఉత్పత్తి చేయడం సాధ్యమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సహజవాయువు ఉత్పత్తికి అనువైన గ్యాస్‌ హైడ్రేట్ల నిల్వ హిందూ మహాసముద్ర పరిధిలో వెలుగుచూడటం ఇదే ప్రథమం. మన దేశంలో గ్యాస్‌హైడ్రేట్లు అన్వేషణను ప్రభుత్వరంగ సంస్థ ఓఎన్‌జీసీ నేతృత్వంలో అమెరికా భూ విజ్ఞాన సర్వే (యూఎస్‌జీఎస్‌), ది జపనీస్‌ డ్రిల్లింగ్‌ కంపెనీ, జపాన్‌ ఏజెన్సీ ఫర్‌ మెరైన్‌ ఎర్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థలకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 2014 సెప్టెంబరులో ప్రారంభించింది. సముద్ర తవ్వకం, సంప్రదాయ అవక్షేప కోరింగ్‌, పీడన కోరిగ్‌ లాంటి చర్యల ద్వారా హిందూ మహాసముద్ర పరిధిలో (బంగాళాఖాతం కూడా ఈ పరిధిలోకే వస్తుంది) అన్వేషణనలు వారు కొనసాగించారు. బంగాళాఖాతంలో కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో గరుకు ఇసుకను నిక్షిప్తం చేసుకునే భూ పొరల్లో గ్యాస్‌ హైడ్రేట్ల నిల్వను భారీగా గుర్తించినట్లు యూఎన్‌జీసీ ప్రకటించింది. సహజ వాయువును విరివిగా అందించే వనరులుగా గ్యాస్‌హైడ్రేట్లకు పేరుంది. సహజ వాయువు, నీరు కలిసి మంచు రూపంలో కలిసి ఉండేవే ఈ హైడ్రేట్లు. ఇవి మహా సముద్రాల, ధృవ ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా ఆవిర్భవిస్తాయి. 

No comments:

Post a Comment