2016 సం॥నికి గాను తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. ఏటా సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్‌లో భాగంగా ఈ అవార్డు వచ్చింది. అభివృద్ధిలోనే కాకుండా దేశ సమగ్రత, నిబద్ధతకు అనుగుణంగా వ్యాపార దృక్పథం, మార్కెటింగ్ నైపుణ్యాులు ప్రదర్శించిన విజేతకు 11 ఏళ్లుగా సీఎన్‌బీసీ గ్రూప్ ఈ అవార్డు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
Monday, September 19, 2016
మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ తెలంగాణ
2016 సం॥నికి గాను తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. ఏటా సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్‌లో భాగంగా ఈ అవార్డు వచ్చింది. అభివృద్ధిలోనే కాకుండా దేశ సమగ్రత, నిబద్ధతకు అనుగుణంగా వ్యాపార దృక్పథం, మార్కెటింగ్ నైపుణ్యాులు ప్రదర్శించిన విజేతకు 11 ఏళ్లుగా సీఎన్‌బీసీ గ్రూప్ ఈ అవార్డు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
వినియోగదారులను తప్పదోవ పట్టిస్తే 5 సం॥ల జైలు
ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు వినియోగదారులను తప్పదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లయితే, 5 సం॥ జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించడం వంటి కీలక సిఫార్పులను వినియోగదారుల మంత్రిత్వశాఖ ఆరీచించింది. ముప్పై ఏళ్ల కిందటి వినియోగదారు పరిరక్షణ చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 ఏడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటరీ స్థాయిరీ సంఘం చేసిన సిఫారసులను ఆమోదించారు. ప్రకటనలు తప్పదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష, రెండోసారి, ఆపైన అదే నేరానికి రూ.50 లక్ష జరిమానా, ఐదేళ్ల జైు శిక్ష విధించానే నిబంధను చేర్చారు.
జైపూర్‌లో బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు
జైపూర్‌లో 2016 ఆగస్టు 20, 21 తేదీల్లో బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతినిధుల బ్రిక్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించడంతోపాటు ప్రపంచ సంస్థల్లో తమ దేశాలకు అధిక భూమిక ఉండాని అభిలషించారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ వాతావరణ మార్పు పరిణామాలను ఎదుర్కోవడం, మహిళ సంక్షేమాన్ని పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.
యూఎన్‌ఓ రేసులో ఆంటోనియో ఆధిక్యం
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గట్టర్స్ స్పష్టమైన ఆధిక్యత సాధించారు. 2016 ఆగస్టు 30న ముగిసిన 15 దేశాల భద్రతా మండలి మూడో దశ ఎన్నికల్లో ఆంటోనియోకు అనుకూలంగా 11 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు రాగా, ఒక అభిప్రాయం నమోదు కాలేదు. గట్టర్స్ గతంలో ఐక్యరాజ్యసమితి శరణార్డుల విభాగానికి 10 సంవత్సరాల పాటు హై కమిషనర్గా పనిచేశారు. ఈ పదవికి పోటీ పడిన స్లావేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ 9 అనుకూల ఓట్లు, 5 వ్యతిరేక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.
యాపిల్‌కు లక్ష కోట్ల జరిమానా
యూరప్ వ్యాప్తంగా చట్ట విరుద్ధంగా పన్ను ప్రయోజనాలు పొందిందనే నెపంతో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌కు యూరోపియన్ యూనియన్ 13 బిలియన్ యూరోలను (దాదాపు రూ. లక్ష కోట్లు) జరిమానా విధించింది. ఐర్లాండ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ప్రత్యేక అవగాహన ఆధారంగా యూరప్‌లో దాదాపు తన వ్యాపార లాభాన్నింటిపైనా యాపిల్ పన్నును ఎగ్గొట్టిందని, వెంటనే వాటిని తిరిగిచెల్లించాలిని ఈసీ తన తీర్పులో పేర్కొంది. బహుళజాతి కంపెనీలను ఆకర్షించటం కోసం ఐర్లాండ్ చాలా ఏళ్లుగా పన్ను ప్రోత్సాహకానిస్తోంది. వీటినే స్వీట్‌హార్ట్ డీల్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ డీల్స్ కారణంగా యాపిల్ తన ఇతర వ్యాపారాల్లోని లాభాలపై కూడా పన్ను చెల్లించలేదని ఈసీ తెలిపింది.
2050నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లు
2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లకు చేరుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో (పీఆర్టి) పేర్కొంది. ఈ మేరకు 2016 ఆగస్టు చివరి వారంలో విడుదల చేసిన 2016 వరల్డ్ పాపులేషన్ డేటాషీట్‌లో తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులనే ఇతివృత్తంతో డేటాను రూపొందించారు. యూరప్‌లో జననాల రేటు బాగా క్షీణించి జనాభా భారీగా తగ్గిపోనుండగా, ఆఫ్రికా దేశాల్లో రెట్టింపు అవుతుందని నివేదిక పేర్కొంది.
దక్షిణ కొరియాలో ఎస్‌బీఐ తొలి శాఖ ప్రారంభం
భారతీయ స్టేట్ బ్యాంక్ దక్షిణ కొరియాలోని సియోల్‌లో తొలి శాఖను ప్రారంభించింది. బ్యాంకు సియోల్ శాఖ పారిశ్రామికవేత్తలకు రిటైల్ బ్యాంకింగ్‌తో సహా టైడ్ ఫైనాన్స్, సిండికేటెడ్ రుణాలు, కార్పొరేట్ డిపాజిట్స్ వంటి తదితర సేవలను అందిస్తుంది. విదేశాల్లో ఎస్‌బీఐకి దాదాపు 135కి పైగా శాఖలు ఉన్నాయి.
Subscribe to:
Posts (Atom)




