Monday, September 12, 2016

ఆసియాలో తొలి 75 అత్యంత నవ్యపథ విశ్వవిద్యాయాల జాబితా


రాయిటర్స్‌ ఆసియాలో తొలి 75 అత్యంత నవ్యపథ విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో జపాన్‌, దక్షిణకొరియా విద్యాసంస్థలు అగ్రస్థానంలో నిలిచాయి. భారత్‌లోని ఐఐటీలు  సంయుక్తంగా 72వ స్థానంలో నిలవగా, బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ 73వ స్థానం దక్కించుకుంది. తొలి 20 స్థానాల్లో నిలిచిన విద్యా సంస్థల్లో 17 దక్షిణ కొరియా, జపాన్‌కు చెందినవే ఉన్నాయి. ఆధునిక శాస్త్రాలపై ఎక్కువగా ద్రుష్టి పెట్టడం, అధునాతన సాంకేతిక పరిశోధనలు, ప్రపంచ ఆర్థిక రంగాల్ని నడిపించడానికి దోహదపడే విద్య, తదితర అంశాల ప్రాతిపదికన ఈ విద్యా సంస్థల జాబితాను రూపొందించారు. కొరియా అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రథమ స్థానం దక్కించుకోగా జపాన్‌కు చెందిన టోక్యో విశ్వవిద్యాలయం రెండో స్థానంలో నిలిచింది. ఇలా మొదటి 10 స్థానాలనూ దక్షిణ కొరియా, జపాన్‌లే దక్కించుకున్నాయి. సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాయం 11వ స్థానంలో నిలిచింది. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment