శాన్‌ఫ్రాన్సిస్కోలో 1945 జూన్ 26న సంతకాలు చేసిన ఐక్యరాజ్యసమితి అధికార పత్రం ఇప్పుడు సంస్కృత భాషలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి అధికార చట్టం సంస్కృతానువాదం ముఖచిత్రం ఫొటోను యూఎన్‌ఓలో భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ ట్విట్టర్‌లో ఉంచారు. 1945 జూన్ 26న సంతకాలైన యూఎన్‌ఓ అధికార పత్రం అదే ఏడాది అక్టోబరు 24 నుంచి అమలులోకి వచ్చింది. సంస్కృతంలో అనువాదానికి మూల కారకుడైన త్రిపాఠీ లక్నోలోని అఖిల భారతీయ సంస్కృత పరిషద్ కార్యదర్శిగా ఉన్నారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg


No comments:
Post a Comment