Saturday, September 17, 2016

రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునే విధంగానే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత కాంగ్రెస్‌ ప్రభుత్వాులు రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే విధంగానే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేశాయని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడిరచింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధిహామీ పథకం అమలు విజయవంతమైనట్లు జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ రాష్ట్రంలో దానిపై పూర్తిగా రాజకీయ ప్రభావం ఉన్నట్లు పేర్కొంది. క్షేత్రస్థాయి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మండలావారీగా వచ్చిన ఓటింగ్‌ సరళికి అనుగుణంగా ఈ పథకం కింద నిధులను ఖర్చు చేసినట్లు నివేదిక తెలిపింది. 

No comments:

Post a Comment