Saturday, September 17, 2016

నేపియర్‌ రకం గడ్డి దిగుమతికి కేంద్రం నిర్ణయం


దేశంలో పశుగ్రాసానికి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నేపియర్‌ రకం గడ్డిని దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండో-ఆఫ్రికన్‌ ఫోరమ్‌ సదస్సులో పాల్గొనేందుకు 2015లో ఉగాండా అధ్యక్షుడు వ్కె.ముసెవెని ఢల్లీికి వచ్చిన సందర్భంగా ఆ దేశం నుంచి నేపియర్‌ను దిగుమతి చేసుకునే అంశంపై చర్చ జరిగింది. అనంతరం ఢిల్లీలోని పూసా వ్యవసాయ పరిశోధన సంస్థ మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నేపియర్‌ దేశవాళీ రకాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 38 లక్షల హెక్టార్లు ఇందుకు అనువుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 

No comments:

Post a Comment