ఆస్కార్ బరిలో ఉత్తమ విదేశీ చిత్రం పురస్కారం కోసం మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా తమిళ చిత్రం విసారణైను భారత చలన చిత్ర సమాఖ్య ఎంపిక చేసింది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో ధనుష్ నిర్మించారు. భారతీయ భాషల్లో రూపొందిన 29 చిత్రాల్ని పరిశీలించిన మండలి విసారణైను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కమిటీ చూసిన 29 సినిమాల్లో తెలుగు నుంచి వెళ్లిన కంచె, రుద్రమదేవి కూడా ఉన్నాయి. ఆస్కార్ న్యాయ నిర్ణాయక మండలి అధ్యక్షుడు కేతన్ మెహతా.
No comments:
Post a Comment