తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రపతి శౌర్య పోలీస్ పతకాలు 2, శార్య పోలీసు పతకాలు కలిపి మొత్తం 24 పతకాలు లభించాయి. వీటితో పాటు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 1, అత్యుత్తమ సేవా పతకాలు 11 లభించాయి. 2016 ఫిబ్రవరిలో బెంగళూరులో ఉగ్రవాది ఆం జెబ్ అఫ్రిదిని పట్టుకునేందుకు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన శ్రీనివాసుకు శౌర్యచక్ర ప్రకటించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్సై దూదేకుల సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజకు మరణానంతరం రాష్ట్రపతి శౌర్య పోలీస్ పతకాలు ప్రకటించారు.
శౌర్యచక్ర
1. కె.శ్రీనివాసు(కానిస్టేబుల్, నిఘా విభాగం)
రాష్ట్రపతి శౌర్య పోలీస్ పతకం
1. దూదేకుల సిద్దయ్య (సబ్ ఇన్‌స్పెక్టర్, నల్గొండ)
2. నాగరాజ (కానిస్టేబుల్, నల్గొండ)
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
1 రాజీవ్ రతన్, డిజి, ఫైర్ సర్వీసెస్
No comments:
Post a Comment