గ్రహాంతరవాసుల అన్వేషణకు దోహదపడే భారీ రేడియో టెలిస్కోప్‌ను చైనా 2016 సెప్టెంబర్ 25న ప్రారంభించింది. 4450 ఫలకాలు కలిగిన ఈ పరికరం ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్. విశ్వ వీక్షణకు ఇది శక్తిమంతమైన సాధనమవుతుందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. ఫైవ్ హండ్రెడ్ మీటర్ అపెర్చర్ స్పెరికల్ టెలిస్కోప్(ఫాస్ట్)ను గుయ్ రaా ఫ్రావిన్స్‌లోని కార్ప్స్ లోయలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సాధనానికి లాంఛనంగా అంతరిక్షం నుంచి తొలి సంకేతాలు అందాయి. ప్రస్తుతం దీన్ని విస్తృతంగా పరీక్షిస్తారు. 3 సం॥ పాటు క్రమాంకనం చేస్తారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తారు. 18 కోట్ల డాలర్లతో 2011లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అంతకు ముందు 17 ఏళ్ల కిందట చైనా ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించారు. టెలిస్కోప్‌లోని డిష్ యాంటెన్నా వెడల్పు 500 మీటర్లు. ఇది 4450 ఫలకాలతో కూడిన రిఫ్లెక్టర్. దీని పరిమాణం 30 ఫుట్‌బాల్ మైదానాల స్థాయిలో ఉంటుంది. ప్రస్తుతం ప్యూర్టోరికోలో ఉన్న ఆరిసెబో అబ్జర్వేటరీలో అతిపెద్ద రేడియో టెలిస్కోపు ఉంది. దీని వెడ్పు 305 మీటర్లు. ఫాస్ట్ టెలిస్కోపు పరిసరాల్లో రేడియో నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. అందువ్ల ఆ ప్రాంతంలోని దాదాపు 8 వేల మంది ప్రజలను తరలించారు. ఖగోళ వస్తువుల నుంచి వెలువడే రేడియో తరంగాలను ఈ టెలిస్కోప్ ఆలకిస్తుంది. దీని పరిమాణం పెద్దగా ఉండటం వల్ల విశ్వంలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సంకేతాలను కూడా సేకరించగదు. విశ్వంలోని అసాధారణ వస్తువులను శోధించి, విశ్వం ఆవిర్భావం గురించి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహాంతరవాసుల అన్వేషణకు సాగుతున్న ప్రయత్నాలకు ఇది ఊతమిస్తుందని చెప్పారు. వచ్చే 10-20 సం॥ వరకూ ఇదే అగ్రస్థాయి రేడియో టెలిస్కోప్‌గా ఉంటుందని పేర్కొన్నారు. టెలిస్కోప్ నిర్మాణం పూర్తయ్యాక విశ్వంలో 3 పల్సార్ల నుంచి వెలువడ్డ రేడియో తరంగాలను ఈ పరికరం గుర్తించగలిగింది. వేగవంతమైన భ్రమణం, ఎక్కువ సాంద్రత కలిగిన నక్షత్రాను పల్సార్లుగా పేర్కొంటారు.
FAST - Five-hundred-meter Aperture Spherical radio Telescope
No comments:
Post a Comment