భారత్‌కు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-18 ప్రయోగం విజయవంతమయ్యింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్-5 వీఏ-231 రాకెట్ ద్వారా 2016 అక్టోబర్ 5 వేకువజామున విజయవంతంగా దీన్ని ప్రయోగించారు. అక్టోబర్ 3వ తేదీ అర్ధరాత్రే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేసి అక్టోబర్ 5న ప్రయోగించారు.
No comments:
Post a Comment