Tuesday, September 20, 2016

వరిలో కొత్త వంగడం థాన్‌ 45


పోషకాహార లోపానికి చెక్‌ పెట్టేలా జింక్‌ ఎక్కువగా ఉండే సరికొత్త వరి వంగడాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సృష్టించారు. దీనికి థాన్‌ 45 అనే పేరుపెట్టారు. పార్లమెంటరీ స్థాయి కమిటీ సూచన మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (గతంలో వరి పరిశోధన సంస్థ) 12 ఏళ్లు నిర్విరామ కృషి చేసింది. డీఆర్‌ఆర్‌ ధాన్‌ 45 అని పిలిచే ఈ వరి 125 రోజల్లో కోతకు వస్తుంది. దీనిలో అత్యధికంగా 22.6 పీపీఎం (ఇప్పటి వరకూ ఉన్న వరి వంగడాల్లో ఇదే ఎక్కువ) జింక్‌ ఉంటుంది.

No comments:

Post a Comment