Wednesday, September 21, 2016

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెస్కే ప్రసాద్‌


భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్‌ నియమితులయ్యారు. ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో సందీప్‌ పాటిల్‌ స్థానంలో ప్రసాద్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.భారత్‌ తరపున ఎమ్మెస్కే ప్రసాద్‌ 6 టెస్టులు, 17 వన్డేలు ఆడారు. బీసీసీఐ సెలక్షన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడైన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ ప్రస్తుతం జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలోనూ ఏడాది పదవీకాలం కూడా పూర్తి చేసుకున్నాడు. దేవాంగ్‌ గాంధీ, గగన్‌ ఖోడా, శరణ్‌దీప్‌ సింగ్‌, జతిన్‌ పరాంజేప్‌ సభ్యులుగా నియమితులయ్యారు. సెలక్టర్‌ పదవికి రేసులో ఉన్న వెంకటేశ్‌ ప్రసాద్‌ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. 


No comments:

Post a Comment