నరేంద్రమోడి ప్రధానమంత్రి అయ్యాక ప్రధానమంత్రి జాతీయ సహాయ నిది(PMNRF)కి విరాళాలు పెరిగినట్లు వెల్లడైంది. 2016 జులై 31 నాటికి పీఎం రిలీఫ్ ఫండ్‌లో రూ.2,621.90 కోట్ల నిధులున్నాయి. వడ్డీ రూపంలోనే ఏటా దాదాపు రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.870 కోట్ల విరాళాలు వచ్చాయి. అందులో కేవలం స్వచ్ఛంద విరాళాల రూపంలోనే రూ.608 కోట్లు అందాయి. వడ్డీలు, ఇతర మార్గాల్లో రూ.216 కోట్లు వచ్చాయి. 1948లో దేశ ప్రథమ ప్రధాని నెహ్రూ జాతీయ సహాయ నిధిని ప్రారంభించారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి తరలివచ్చిన బాధితులను ఆదుకోవడానికి ప్రజల నుంచి స్వీకరించిన విరాళాలతో ఈ నిధికి ప్రాణం పోశారు. ప్రస్తుతం ఈ నిధిని వరదలు, తుపాన్లు, భూకంపాల్లాంటి ప్రక ృతి వైపరీత్యాలతో పాటు, భారీ ప్రమాదాలు, మత కలహాల బాధితులకు చేయూతనందించడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే గుండె చికిత్సు, కిడ్నీ మార్పిళ్లు, క్యాన్సర్ చికిత్స లాంటి వాటి కోసం కూడా సహాయం చేస్తూ వస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ కేటాయించడం లేదు. పూర్తిగా విరాళాపై ఆధారపడే దీన్ని నిర్వహిస్తున్నారు.
PMNRF-Prime Minister's National Relief Fund
No comments:
Post a Comment