రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అలాగే సాధారణ బడ్జెట్‌నూ నెల ముందుగానే ప్రవేశపెట్టడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చు వర్గీకరణ తొలగించి వాటి స్థానంలో మూలధనం, రాబడిని (కేపిటల్ అండ్ రిసీట్) చేర్చాలనీ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2016 సెప్టెంబర్ 21న భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ కీక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి చివరి తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బ్రిటిష్ కాలపు సంప్రదాయానికి ముగింపు పలకడానికి కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టడం 1924లో మొదలైంది.
కేంద్ర కేబినెట్ ఇతర కీలక నిర్ణయాలు:
- ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందానికి ఆమోదం
- స్వాతంత్య్ర సమరయోధుల నెలవారీ పింఛన్ 20% పెంపు
- పప్పు ధాన్యాులు, వంటనూనొలు, నూనెగింజల న్విపై పరిమితులు 2017 సెప్టెంబరు 30 వరకు పొడిగింపు
- జమ్మూకశ్మీర్‌లో మరో 10 వే ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్‌పీఓ) నియామకాలు
- గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ నిర్వహణ కోసం ప్రభుత్వరంగ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌కు వచ్చిన లోటును పూడ్చటం కోసం రూ.1250 కోట్ల పరిహారం
- జాతీయ గ్రిడ్‌తో తూర్పు ప్రాంతాన్ని అనుసంధానించడం కోసం జగదీష్‌పూర్ హైదియా, బొకారో-ధామా గ్యాస్ పైపును (జేహెచ్‌బీడీపీఎల్) ప్రాజెక్టుకు రూ.5176 కోట్ల నిధులు
No comments:
Post a Comment