Wednesday, October 5, 2016

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా నదీజలాల ట్రైబ్యునల్‌ కాపరిమితి పొడిగింపు


ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా మధ్య నదీజల వివాద పరిష్కారానికి ఏర్పాటైన ట్రైబ్యునల్‌ కాపరిమితిని కేంద్ర ప్రభుత్వం 2017 సెప్టెంబరు 17 వరకు పెంచింది. 2010 ఫిబ్రవరి 24న ఏర్పాటైన ఈ ట్రైబ్యునల్‌ 2013 ఫిబ్రవరి 23 నాటికల్లా తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ ట్రైబ్యునల్‌ 2012 సెప్టెంబరు 17న ఏర్పాటైనట్లు పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఒడిశా ప్రభుత్వం 2013లో కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఒడిశా వాదనను సమర్థిస్తూ 2013 డిసెంబరు 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ట్రైబ్యునల్‌ ఏర్పాటు తేదీని 2012 సెప్టెంబరు 17గా నిర్ధారిస్తూ 2014 మార్చి 14న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ రోజు నుంచి మూడేళ్ల లోపు నివేదిక ఇవ్వాని నిర్దేశించింది. ఆ గడువు 2015 సెప్టెంబరు 17తో ముగిసిపోయినప్పటికీ దాన్ని మరో ఏడాది పొడిగించాలని ట్రైబ్యునల్‌ కోరడంతో 2016 వరకు పెంచింది. ఇప్పుడు రెండోసారి చేసిన విజ్ఞప్తి మేరకు మరో ఏడాది పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 

No comments:

Post a Comment