Tuesday, August 23, 2016

మద్రాసు హైకోర్టు పేరు మార్పుకు ప్రభుత్వం వ్యతిరేకత


మద్రాసు హైకోర్టు పేరును చెన్నై హైకోర్టుగా మార్చుతూ కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. తమిళనాడు హైకోర్టుగా మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని బొంబాయి, కలకత్తా, మద్రాసు హైకోర్టు పేర్లను మార్చుతూ హైకోర్టు (పేర్ల సవరణ) బిల్లు 2016ను తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. దాని ప్రకారం మద్రాసు హైకోర్టును చెన్నై హైకోర్టుగా మార్చనున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో ముఖ్యమంత్రి జయలిత ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నో రాష్ట్రాలు ఏర్పడి అక్కడి హైకోర్టుకు ఆ రాష్ట్రం పేరు పెట్టారని, అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని కోరారు. ఈ తీర్మానానికి డీఎంకే కూడా మద్దతు పలికింది.

No comments:

Post a Comment