Monday, August 14, 2023

Kerala : మా రాష్ట్రం పేరును కేరళం అని మార్చండి

 


  • తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కేరళ శాసనసభ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని 2023 ఆగస్టు 9న పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. 
  • పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ పేరును అన్ని భాషల్లో కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 
  • తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళం’ అని పిలిచేవారని గుర్తు చేశారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన చెప్పారు. 
  • ‘‘రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మా రాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం దానిని ‘కేరళం’గా సవరించాలి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో తక్షణమే మార్పులు చేయాలి. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తోంది’’అని సీఎం విజయన్‌ అన్నారు. 
  • ఈ తీర్మానానికి ఎటువంటి సవరణలు ప్రతిపాదించకుండా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ ఎ.ఎన్‌.షంషీర్‌ ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.

No comments:

Post a Comment