- అస్సాంలోని శాసనసభ (116), లోక్‌సభ (14) నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి తుది నివేదికను భారత ఎన్నికల సంఘం 2023 ఆగస్టు 11న విడుదల చేసింది.
- తాజా పరిణామంతో ఆయా నియోజకవర్గాల సంఖ్యలో ఎటువంటి మార్పు రాలేదు. అయితే ఓ ఎంపీ, 19 అసెంబ్లీ స్థానాల పేర్లు మార్చారు. అలాగే 19 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాలను షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు చేశారు.
- ఓ ఎంపీ స్థానం, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలను షెడ్యూల్డ్ కులాలకు కేటాయించారు. దీంతో కొత్తగా ఎస్టీలకు మూడు, ఎస్సీలకు ఓ శాసనసభ స్థానం పెరిగాయి. 2001 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది.
No comments:
Post a Comment