Saturday, October 8, 2016

కొలంబియా శాంతి ఒప్పంద కార్యక్రమానికి రవిశంకర్‌కు ఆహ్వానం


కొలంబియా ప్రజా సైన్యం(తిరుగుబాటు సైనిక బలగాలు- ఎఫ్‌ఏఆర్‌సీ), ప్రభుత్వానికి మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను ఎఫ్‌ఏఆర్‌సీ, కొలంబియా అధ్యక్షుడు జువాన్‌ మాన్యుయేల్‌ శాంటోస్‌ ఆహ్వానించారు.  సుమారు 15 మంది దేశాధినేతలు హాజరు కావొచ్చని భావిస్తున్న ఈ కార్యక్రమానికి తూర్పు దేశాల నుంచి వెళ్తున్న ఏకైక ఆధ్యాత్మిక గురువు రవిశంకరే. ఆగస్టు 24న శాంతి ఒప్పందం కుదరడంలో రవిశంకర్‌ చేసిన కృషి ఎనలేనిదని కొలంబియా అధ్యక్షుడు కొనియాడారు. రవిశంకర్‌ 2015 జూన్‌లో అధ్యక్షుడు జువాన్‌ను కలుసుకుని శాంతి నెలకొనడానికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హవానాకు వెళ్లి ఎఫ్‌ఏఆర్‌సీ కమాండర్లతో చర్చించారు. గాంధీజీ సిద్ధాంతాల ప్రకారం అహింసా విధానంలో పోరాడేలా ఒప్పించారు. 

No comments:

Post a Comment