Debabrata Kanta : మాజీ ఐఏఎస్ అధికారి దేబబ్రత కంఠ మృతి
- ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్‌గా సేవలు అందించిన దేబబ్రత కంఠ(58) అనారోగ్యంతో 2023 ఆగస్టు 8న తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో మరణించారు.
- ఆయన భార్య సౌమ్యామిశ్రా తెలంగాణలో అదనపు డీజీ(పర్సనల్)గా పనిచేస్తున్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన దేబబ్రత కంఠ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 వరకు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్ కలెక్టరుగా(1998-2001) పనిచేసిన సమయంలో కుటుంబ నియంత్రణ(కు.ని.)కు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. రెండేళ్లలో లక్ష కు.ని. ఆపరేషన్లు చేయించి రికార్డు సృష్టించారు.
- ఉమ్మడి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను ప్రారంభించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. 2008లో తన పదవికి రాజీనామా చేసి ఒడిశా వెళ్లిపోయారు. అనంతరం అక్కడ స్వచ్ఛంద సేవాసంస్థ ప్రారంభించి రాజకీయాల్లోకి దిగారు. అప్పటి నుంచి ఒడిశాలోనే ఉంటున్నారు. ఆయన భార్య సౌమ్యామిశ్రా తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి.
No comments:
Post a Comment