Tuesday, August 22, 2023

digital currency : ప్రభుత్వ రంగ - ప్రైవేటు రంగ బ్యాంకుల్లో డిజిటల్‌ కరెన్సీకి మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చిన తొలి బ్యాంక్‌ ఏది?

digital currency2-#successsecret

  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చేపట్టిన సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా కెనరా బ్యాంక్‌ 2023 ఆగస్టు 21న ‘కెనరా డిజిటల్‌ రూపీ యాప్‌’ పేరిట ఒక యూపీఐ ఇంటరాపబుల్‌ డిజిటల్‌ రూపీ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. 
  • ప్రభుత్వ రంగ - ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఈ విధంగా డిజిటల్‌ కరెన్సీకి మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చిన తొలి బ్యాంక్‌ ఇదే. 

ఎలా పనిచేస్తుందంటే..

  • వినియోగదార్లు మర్చంట్‌ యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను, కెనరా డిజిటల్‌ రూపీ యాప్‌తో స్కాన్‌ చేయొచ్చు. తద్వారా డిజిటల్‌ కరెన్సీలో చెల్లింపులు చేయొచ్చు. ఈ ఫీచరు ప్రస్తుత యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ల ద్వారానే పనిచేస్తుంది. అంటే సీబీడీసీకి విడిగా క్యూఆర్‌ కోడ్‌ల అవసరం ఉండదు.
  • అనుసంధానమై ఉన్న ఖాతా నుంచి సీబీడీసీ వాలెట్‌లోకి కరెన్సీని లోడ్‌ చేయాలి.
  • సీబీడీసీ వాలెట్‌ ఉన్న ఏ వ్యక్తికైనా డిజిటల్‌ కరెన్సీని బదిలీ చేయొచ్చు. సీబీడీసీ క్యూఆర్‌ ఆధారిత చెల్లింపులను ఎవరికైనా చేయొచ్చు. ఎవరి నుంచైనా పొందొచ్చు.
  • వ్యాపారులకు సైతం యూపీఐ లేదా సీబీడీసీ క్యూఆర్‌ ఆధారిత చెల్లింపులు చేయొచ్చు.
  • అవసరం అనుకుంటే డిజిటల్‌ కరెన్సీని తిరిగి అనుసంధానం చేసి ఉన్న ఖాతాకు క్రెడిట్‌ చేసుకోవచ్చు.

old elephant : 2023 ఆగస్టు 20న మృతి చెందిన దేశంలోనే ‘వృద్ధ ఏనుగు’ పేరు ఏమిటి?

Which of the public sector and private sector banks is the first bank to introduce a mobile app for digital currency?

  • As part of the Central Bank Digital Currency (CBDC) pilot project undertaken by the Reserve Bank of India (RBI), Canara Bank launched a UPI-interoperable digital rupee mobile app on 21 August 2023 called 'Canara Digital Rupee App'.
  • This is the first bank in public sector and private sector banks to bring a mobile app for digital currency in this way.

How does it work?

  • Users can scan merchant UPI QR codes with the Canara Digital Rupee app. So that payments can be made in digital currency. This feature works only through existing UPI QR codes. That means there is no need for separate QR codes for CBDC.
  • Currency should be loaded into the CBDC wallet from the linked account.
  • Anyone with a CBDC wallet can transfer digital currency. Anyone can make CBDC QR based payments. You can get it from anyone.
  • Merchants can also make UPI or CBDC QR based payments.
  • The digital currency can be credited back to the linked account if required.

No comments:

Post a Comment