Tuesday, August 22, 2023

Not using google account...? : గూగుల్‌ అకౌంట్‌ వాడట్లేదా...?

google2-#successsecret

  • మీ జీ మెయిల్‌ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్‌ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్‌ 1 నుంచి గూగుల్‌ అందుబాటులోకి తెస్తోంది.
  • దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్‌ తన యూజర్లందరికీ మెయిల్స్‌ పంపింది. తాను అందించే అన్ని సర్వీసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్‌ డిలీషన్‌ అందులో భాగమే’’ అని గూగుల్‌ ప్రకటించింది.  

వీటికి వర్తిస్తుంది...  

  • గూగుల్‌ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్‌ ఇన్‌ చేయకపోతే, వాడకపోతే.
  • ఒకసారి డిలీట్‌ చేసిన అకౌంట్‌ తాలూకు జీ మెయిల్‌ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు.
  • సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్‌ చేస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది.
  • అయితే అకౌంట్‌ను డిలీట్‌ చేసే ముందు గూగుల్‌ పలుమార్లు రిమైండర్‌ మెయిల్స్‌ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్‌ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి.
  • ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్‌ రావడం మొదలవుతుంది.

మీ గూగుల్‌ అకౌంట్‌ యాక్టివ్‌గా ఉండాలంటే...

  • తరచూ లాగిన్‌ అవుతూ ఉన్నా...
  • కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్‌ అయినా...
  • గూగుల్‌ డ్రైవ్‌ వాడినా...
  • మెయిల్‌ పంపినా, చదివినా...
  • యూట్యూబ్‌లో వీడియో చూసినా...
  • ఏ గూగుల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినా...
  • థర్డ్‌ పార్టీ యాప్‌, సర్వీస్‌లను గూగుల్‌ ద్వారా సైన్‌ ఇన్‌ చేసినా మీ గూగుల్‌ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు.

మినహాయింపులున్నాయ్‌..

  • గూగుల్‌ అకౌంట్‌ డిలీషన్‌ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్‌ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు  
  • యూట్యూబ్‌ చానల్స్‌, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్‌ అకౌంట్‌
  • డబ్బులతో కూడిన గిఫ్ట్‌ కార్డులున్న జీ మెయిల్‌ అకౌంట్‌
  • పబ్లిషిడ్‌ అప్లికేషన్‌ ఉన్న అకౌంట్‌   

Heavy drop system : హెవీ డ్రాప్‌ వ్యవస్థ ట్రయల్స్‌ సక్సెస్‌

Not using google account...?

  • Not really using your Gmail account lately? Has it been two years since you saw it? But it will be deleted permanently. To this extent, Google is making the new policy available from December 1, 2023.
  • Google has sent mails to all its users giving all the details related to this. It has made it clear that this applies to all the services and products it offers. Our aim is to ensure that our users' data remains completely confidential and secure even if they stop using their account. Google announced that account deletion is part of it.

Applies to...

  • If Google Account has not been signed in or used for two years.
  • Once the account is deleted, the Gmail address will not be assigned to anyone else.
  • Google has said that it is updating its policy for safety and security reasons.
  • But before deleting the account, Google sends reminder mails several times. They will also go to the recovery account of the user Taluk along with that account.
  • These mails start coming at least 8 months before any action is taken.

To keep your google account active...

  • Logging in frequently...
  • Login at least once in two years...
  • Using Google Drive...
  • Whether sending mail or reading...
  • Watch the video on YouTube...
  • Any google app download...
  • Signing in to third party apps and services through Google will not affect your Google account.

There are exceptions..

  • There are some exceptions to the Google Account Deletion Policy. According to them the new policy of deleting accounts that have not been used for two years will not apply to the following
  • Google account with YouTube channels, account and comments
  • Gmail account with cashed gift cards
  • An account with a published application

No comments:

Post a Comment