Tuesday, August 22, 2023

small grains : చిరుధాన్యాల ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

 

small grains2-#successsecret

  • చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో గుజరాత్‌, మహారాష్ట్ర, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. చిరుధాన్యాలను ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్‌ ఉందని కూడా పేర్కొంది.
  • ఈ నేపథ్యంలో.. దేశం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,69,049.22 మెట్రిక్‌ టన్నుల చిరుధాన్యాలను ఎక్కువగా ఐదు దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది.ఇందులో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు 17.8 శాతం, సౌదీ అరబ్‌కు 13.7 శాతం, నేపాల్‌కు 7.4 శాతం, బంగ్లాదేశ్‌కు 4.9 శాతం, జపాన్‌కు 4.4 శాతం ఎగుమతి చేసినట్లు కేంద్రం పేర్కొంది.

అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం..

  • అంతర్జాతీయ మార్కెట్‌లో చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్‌ ఫోరమ్‌ (ఈపీఎఫ్‌)ను ఏర్పాటుచేసినట్లు కూడా తెలిపింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణపై దృష్టిసారించాయని పేర్కొంది.

ఉత్పత్తి, వినియోగం పెంపు..

  • అలాగే, స్థానికంగా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మధ్య­ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడానికి రాష్ట్ర మిల్లెట్‌ మిషన్లను అమలుచేస్తున్నాయని కేంద్రం తెలిపింది. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత రాయబార కార్యాల­యాలు చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పలు చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది.

2022-23లో రాష్ట్రాల వారీగా చిరుధాన్యాల ఎగుమతులు (మెట్రిక్‌ టన్నుల్లో)

రాష్ట్రం         ఎగుమతి

1. గుజరాత్‌         78,106.15

2. మహారాష్ట్ర 50,486.43

3. బీహార్‌         19,917.76

4. పశ్చిమ బెంగాల్‌ 12,587.49

5. తమిళనాడు 2,952.63

6. తెలంగాణ 1,680.25

7. ఆంధ్రప్రదేశ్‌         1,319.78

8. కర్ణాటక         429.25

9. రాజస్థాన్‌         405.71

10. మధ్యప్రదేశ్‌ 345.75

11. కేరళ         326.95

12. హరియాణ 301.59

13. ఉత్తరప్రదేశ్‌ 112.14

14. పంజాబ్‌         50.64

15. ఇతర రాష్ట్రాలు 20.69

ODI World Cup mascots : వన్డే ప్రపంచకప్‌ మస్కట్లు

Which state ranks first in exports of small grains?

  • Andhra Pradesh ranks 7th in the country in the exports of small grains. The Ministry of Commerce and Industry has revealed that Gujarat, Maharashtra, Bihar, West Bengal, Telangana and Tamil Nadu are in the first six positions. It also states that India is among the top five exporters of small grains.
  • In this background, the country has exported 1,69,049.22 metric tons of small grains to five countries in the financial year 2022-23. Out of this, 17.8 percent to United Arab Emirates, 13.7 percent to Saudi Arabia, 7.4 percent to Nepal, 4.9 percent to Bangladesh and 4.4 percent to Japan, the center said. stated.

Encouragement in international market..

  • It also said that an Export Promotion Forum (EPF) has been set up specifically to promote snacks in the international market. In view of the declaration of 2023 as the International Year of Cereals, the central and state governments have focused on conducting various programs to increase their production and consumption throughout this year.

Increase in production and consumption

  • Also, various state governments have taken steps to promote consumption of small grains locally. As part of this, states like Assam, Bihar, Chhattisgarh, Karnataka, Madhya Pradesh, Maharashtra, Odisha, Rajasthan, Tamil Nadu, Uttarakhand and Uttar Pradesh are implementing state millet missions to increase production and consumption, the Center said. Moreover, the state governments as well as Indian embassies have taken several measures to create awareness about the consumption of small grains.

State-wise exports of small grains in 2022-23 (in metric tonnes)

State                         export

1. Gujarat                         78,106.15

2. Maharashtra                 50,486.43

3. Bihar                             19,917.76

4. West Bengal                 12,587.49

5. Tamil Nadu                   2,952.63

6. Telangana                     1,680.25

7. Andhra Pradesh             1,319.78

8. Karnataka                     429.25

9. Rajasthan                     405.71

10. Madhya Pradesh         345.75

11. Kerala                         326.95

12. Haryana                     301.59

13. Uttar Pradesh             112.14

14. Punjab                         50.64

15. Other States                 20.69

No comments:

Post a Comment