- వాహన చోదకులకు రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్‌సీలు ఇక కార్డు రూపంలో ఉండవు. సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్ చేసిన పత్రాలే దీనికి సరిపోతాయని రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
- లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి వరకు కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛార్జీలను వసూలు చేయడం లేదు. ఇప్పటికే డబ్బులు చెల్లించిన చోదకులకు మాత్రం త్వరలో కార్డులను అందజేయనున్నారు.
- రవాణా శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ‘వాహన్ పరివార్’తో సేవలన్నీ ఆన్‌లైన్ చేయడంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి, డిజిటల్ రూపంలోనే పత్రాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో కూడా దీన్ని అమల్లోకి తెచ్చారు.
- రవాణాశాఖ వెబ్‌సైట్ హెచ్‌టీటీపీఎస్//ఏపీఆర్‌టీఎసిటిజన్.ఈప్రగతి.ఓఆర్జీలో ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకొని ధ్రువపత్రాన్ని తీసుకోవాలి. లేదా ‘ఏపీఆర్‌టీఏసిటిజన్’ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- వాహనాల్ని తనిఖీలు చేసే పోలీసు, రవాణాశాఖ అధికారులకు డౌన్‌లోడ్ చేసిన పత్రాలను చూపిస్తే సరిపోతుంది. వీటిని అనుమతించాలని తనిఖీలు చేసే పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Holiday for driving license and RC cards in AP
- The driving licenses and RCs issued by the transport department to the vehicle drivers will no longer be in the form of cards. The Transport Commissioner has issued an order that the documents downloaded in the relevant app will be sufficient.
- Until now, for licenses and RCs, Rs.200 per card and Rs.25 for postal service were charged along with a total of Rs.225 challan. Now those charges are not collected. The drivers who have already paid will be given cards soon.
- With regard to the transport department, as the central government has made all services online with the 'Vahan Parivar', cards have been removed in many states and documents have been brought in digital form. Now it has been implemented in AP as well.
- Download Form 6 or 23 from the Transport Department website http://aprtacitizen.epragati.org and take the certificate. Or 'APRTAcitizen' can be downloaded through the app through Android mobile.
- Just show the downloaded documents to the police and transport officials who inspect the vehicles. Instructions have been issued to the officials of the police, transport and other departments who conduct inspections to allow these.
No comments:
Post a Comment