- రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకుల్లో సభ్యుల నియామకం, ఓటరు జాబితాల తయారీకి సంబంధించి చట్ట సవరణ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
- సంఘాల పాలకవర్గాల్లో వివిధ రంగాలనుంచి నిపుణుల నియామకం, సీఈఓల ఎంపికకు సంబంధించిన అంశాలనూ ఇందులో పొందుపరిచారు. ఒక ప్రాథమిక సహకార పరపతి సంఘం పరిధిలో ఉండే ఓటర్లను రైతు భరోసా కేంద్రాలవారీగా విభజించి ఓటర్ల జాబితాలను తయారుచేస్తారు.
- పాలకవర్గాల్లో వ్యవసాయ, డెయిరీ, పశుసంవర్థక, బ్యాంకింగ్, చార్టర్డ్ అకౌంటెంట్, ఉద్యాన, మత్స్య తదితర రంగాల నిపుణులను నియమిస్తారు. వారికి ఓటింగ్ హక్కులు ఉండవు. ఆయా ప్రాంతాల్లోని గ్రామసచివాలయాల్లో పనిచేసే వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక సహాయకుల్ని కోఆప్టెడ్ సభ్యులుగా నియమిస్తారు.
- ఆప్కాబ్ సీఈఓ ఎంపిక కమిటీలో ఆప్కాబ్ అధ్యక్షుడు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ సహకారశాఖ ముఖ్య కార్యదర్శులు ఉంటారు. సహకార కేంద్ర బ్యాంకుల సీఈఓల నియామక కమిటీల్లో ఆప్కాబ్ అధ్యక్షులతోపాటు ఎండీ, రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్, నాబార్డు సీజీఎం ఉంటారు.
Saturday, August 12, 2023
PACS : ఆర్‌బీకే వారీగా పీఏసీఎస్ ఓటరు జాబితాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment