తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన కార్యచరణలకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర భాష, సాంస్కృతిక, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ సహాదారుల పరకా ప్రభాకర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీకాంత్, పురావస్తుశాఖ సంచాకు జీవీ రామకృష్ణారావు, సాంస్కృతిక శాఖ సంచాకు డి.విజయభాస్కర్ సభ్యులుగా ఉంటారు.
Showing posts with label AP Events. Show all posts
Showing posts with label AP Events. Show all posts
Friday, October 7, 2016
తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి కమిటీ
తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన కార్యచరణలకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర భాష, సాంస్కృతిక, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ప్రభుత్వ సహాదారుల పరకా ప్రభాకర్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీకాంత్, పురావస్తుశాఖ సంచాకు జీవీ రామకృష్ణారావు, సాంస్కృతిక శాఖ సంచాకు డి.విజయభాస్కర్ సభ్యులుగా ఉంటారు.
Thursday, October 6, 2016
ఏపీకి ఉత్తమ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ అవార్డు
దేశంలోనే ఉత్తమ రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ)గా ఆంధ్రప్రదేశ్ పురస్కారం పొందింది. భారత స్వతంత్ర విద్యుత్తు ఉత్పత్తిదారు సంఘం (ఐపీపీఏఐ) నుంచి ఈ పురస్కారం లభించింది. దశాబ్ద కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వేగంగా విద్యుదీకరణ సాధించిన సంస్థగా తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ను ఐపీపీఏఐ ఎంపిక చేసింది. గోవాలో జరిగిన సమావేశంలో ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.
ఏపీకి 2 కొత్త రకం రైళ్లు
ఆంధ్రప్రదేశ్‌కు రెండు కొత్త రకం రైళ్లు ఖరారయ్యాయి. వీటిలో తిరుపతి-జమ్ముతావి మధ్య హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-విజయవాడ మధ్య ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఇవికాకుండా మరో 7 కొత్త రకం రైళ్లు దక్షిణ మధ్యరైల్వే పరిధిలో రాకపోకలు సాగించనున్నాయి. వీటితో కలిపి మొత్తంగా రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 23 కొత్త రకం రైళ్లను ప్రకటించింది. ఇందులో 10 హమ్‌సఫర్, 3 తేజస్, 7 అంత్యోదయ, 3 ఉదయ్ రైళ్లు ఉన్నాయి.
స్టార్టప్ అనుమతులపై ఏపీకి ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు
రాష్ట్రంలో స్టార్టప్‌కు శీఘ్రగతిన అనుమతులు మంజూరు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ బ్యాంకు ప్రశంసలు పొందింది. కేవలం 14 రోజుల్లో అన్ని అనుమతలు జారీ చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ డెస్క్ బ్యూరో విధానం సత్ఫలితానిస్తోందని, దేశంలో స్టార్టప్‌కు ఇంత త్వరగా అనుమతులు ఇస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే అని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) తరపున ప్రపంచ బ్యాంకు 2015 సెప్టెంబరులో జరిపిన అధ్యయనంలో వ్యాపారం సుభతరంగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అనువైందని అభిప్రాయపడిరది.
ఏపీలో ఇక తెలుగు తప్పనిసరి
తెలుగు భాష అభివృద్ధిలో భాగంగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలపై పేర్లను తప్పనిసరిగా తెలుగులోనే రాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్ని కూడా తెలుగులోనే ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శంకుస్థాపనలను, ప్రారంభోత్సవాలకు సంబంధించి శిలాఫలకాలపై వివరాలను తప్పనిసరిగా తెలుగులోనే రాయించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, శాఖాపతులను ప్రభుత్వం ఆదేశించింది.
Saturday, September 17, 2016
స్మార్ట్ గవర్నెన్స్‌లో ఏపీకి 7 అవార్డులు
జాతీయ స్థాయిలో స్మార్ట్ గవర్నెన్స్ అంశంపై దేశవ్యాప్తంగా స్కాచ్ నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 7 అవార్డులు లభించాయి. అందులో విజయవాడ నగరపాక సంస్థ(VMC)కు 6 అవార్డులు లభించాయి. సౌరనగరం, డిజిటల్ ఇంటి సంఖ్య విధానం, సమీకృత ఆన్‌లైన్ అభివృద్ధి అనుమతుల నిర్వహణ వ్యవస్థ, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం, స్మార్ట్‌సిటీ యాప్ విభాగాల్లో వీఎంసీ పురస్కారాలు దక్కించుకుంది. వీటితో పాటు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛభారత్ అంశంలో అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పురపాలక సంఘానికి బంగారు పతకం లభించింది.
VMC-Vijayawada Municipal Corporation
Sunday, September 11, 2016
ఏపీ విద్యుత్ అంబుడ్స్‌మన్‌గా బసవయ్య
విద్యుత్ వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా ఏర్పాటైన విద్యుత్ అంబుడ్స్‌మన్‌గా నలదల బసవయ్యను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(APERC) నియమించింది. పదవీ విరమణ చేసిన జిల్లా జడ్జి అయిన బసవయ్య మూడేళ్లు లేదా 68 ఏళ్ల వయసు వచ్చే వరకు అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తారు.
APERC-Andhra Pradesh Electricity Regulatory Commission
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
సంస్థల ఆస్తుల విభజన కోసం కేంద్రంతో చర్చకు బాలసుబ్రహ్మణ్యం, కుటుంబరావు
పునర్విభజన చట్టం-2014 పదో షెడ్యూులులో ఉన్న సంస్థల ఆస్తుల విభజన కోసం కేంద్రంతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రిటైర్డ్ ఐఏఎస్ బాల సుబ్రహ్మణ్యం, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎంపికయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల్ని అనుసరించి చర్చ కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఇద్దరు వంతున పేర్లను పంపాలని కేంద్రం ఇటీవల లేఖ రాసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఎంపిక చేసింది. 10వ షెడ్యూులులో 142 సంస్థలు ఉన్నాయి. ఏపీ ఉన్నత విద్యామండలి వ్యవహారంలో సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులో రెండు నెలల్లో కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. దీని ప్రకారం కేంద్ర హోంశాఖ అడిషనల్ డైరెక్టర్ ఛైర్మన్‌గా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో సభ్యులుగా రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు వంతున ఉండాలని, వారి పేర్లను పంపించాలని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో వీరి ఎంపిక జరిగింది.
Saturday, September 10, 2016
ఆంధ్రప్రదేశ్‌లో 1000 జన ఔషధి దుకాణాలు
ఆంధ్రప్రదేశ్‌లో 1000 జన ఔషధి దుకాణాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తక్కువ ధరకే మందులు అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్న సంజీవని పేరుతో జనరిక్ దుకాణాలును డ్వాక్రా సంఘా ల ద్వారా నిర్వహిస్తోంది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
విజయవాడ మెట్రో రైలు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా DMRC
విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు సత్వర పూర్తి దిశగా కీలక ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకూ సహా సంస్థగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (DMRC) ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఈ మేరకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (AMRC) ఎండీ ఎన్.పి.రామకృష్ణారెడ్డి, DMRC ఎండీ మంగూసింగ్ అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం విజయవాడ మెట్రో ప్రాజెక్టును DMRC 4 సం॥ వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
DMRC-Delhi Metro Rail Corporation
AMRC-Amaravati Metro Rail Corporation
Friday, September 2, 2016
ఏపీలో డీఎన్‌ఏ ఇండెక్స్ సిస్టమ్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు 2016 ఆగస్టు 20న ఉండవల్లిలోని తన నివాసంలో డీఎన్‌ఏ సూచిక వ్యవస్థ (డీఎన్‌ఏ ఇండెక్స్ సిస్టమ్) ను ప్రారంభించారు. ఈ వ్యవస్థ ముఖ్యోద్దేశం నేర పరిశోధన, నియంత్రణలోనూ ఉపయోగపడటం, ప్రపంచవ్యాప్తంగా 73 దేశాల్లో ఈ తరహా వ్యవస్థ అమలులో ఉంది. మన దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని ఏపీ ఫోరెన్సిక్ ప్రయోగశాలలో ఈ సాంకేతికతతో కూడిన డీఎన్‌ఏ విశ్లేషణ పరికరం అందుబాటులోకి వచ్చింది.
Tuesday, August 30, 2016
Saturday, August 27, 2016
ఏపీకి రూ.1176.50 కోట్ల కేంద్ర సాయం
విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరికొంత సాయం చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన రెవెన్యూ లోటు కింద తాజాగా రూ.1176.50 కోట్లు విడుదల చేసింది. రాయసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్లు చొప్పున రూ.350 కోట్లు ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించింది. దీంతో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.1976.50 కోట్లు ఇచ్చినట్లుయింది. విభజన చట్టంలోని సెక్షన్ 46(2) ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడ్డ రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాల్సి ఉంది. ఆడిట్ లెక్కల ప్రకారం ఆ ఏడాదికి రూ.16,079 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడగా కేంద్రం గత రెండేళ్లలో రూ.2803 కోట్లు ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన రూ.1176.50 కోట్లతో ఇది రూ.3979.50 కోట్లకు చేరింది. విభజన చట్టంలోని సెక్షన్ 94(3) ప్రకారం నూతన రాజధాని అమరావతిలో నిర్మించే రాజభవన్ హైకోర్టు, సచివాయం, అసెంబ్లీ ఉభయ సభలతో పాటు అవసరమైన మౌలిక వసతులు నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. విభజన చట్టంలో చెప్పిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.8,379.50 కోట్లు ఇచ్చినట్లయ్యింది.
Friday, August 26, 2016
Tuesday, August 23, 2016
విజయవాడ-ధర్మవరం మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు
విజయవాడ-ధర్మవరం మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు డిల్లీ నుంచి రిమోట్ లింక్‌తో ప్రారంభించారు. మొత్తం 510 కి.మీ. దూరమున్న ఈ రెండు స్టేషన్ల మధ్య ఇది వారంలో మూడు రోజులపాటు రాకపోకలు సాగిస్తుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, జిల్లాల్లో ప్రయాణించే ఈ రైల్లో 11 బోగీలు ఉంటాయి.
Subscribe to:
Posts (Atom)



















