Saturday, October 8, 2016

ఎంపీసీలో ముగ్గురు సభ్యుల నియామకం


వడ్డీ రేట్లను నిర్ణయించే పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) లో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్లు చేతన్‌ ఘటే, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ డైరెక్టర్‌ పమి దువా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌ ప్రొఫెసర్‌  రవీంద్ర హెచ్‌ ధోలాకియాను ఈ కమిటీలో నియమించారు. ఎంపీసీలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. వీరిలో ముగ్గురిని ప్రభుత్వం మరో ముగ్గురిని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నియమించాని నిర్ణయించారు. వీరు 4 సం॥ల పాటు పదవిలో ఉంటారు. ఆర్‌బీఐ తరపున ఆర్‌బీఐ గవర్నరు, ఒక డిప్యూటీ గవర్నరుతో పాటు, బ్యాంకు నియమించే మరో సభ్యుడు/ సభ్యురాలు ఈ కమిటీలో ఉంటారు. ఎంపీసీకి ఆర్‌బీఐ గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షత వహిస్తారు.

No comments:

Post a Comment