Sunday, September 11, 2016

లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ అధ్యక్షుడిగా ఎల్‌.కె.అద్వానీ



లోక్‌సభ నైతిక  విలువల  సంఘం(ఎథిక్స్‌ కమిటీ) అధ్యక్షుడిగా మరోసారి బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌.కె.అద్వానీని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ 2016 సెప్టెంబర్‌ 7న నియమించారు. నైతిక విలువల  సంఘంలో కొత్తగా రాకేష్‌సింగ్‌, అక్షయ్‌ యాదవ్‌కు చోటు దక్కింది. మిగతా సభ్యులం తా పునర్నియమితులు కాగా వీరిలో మల్లారెడ్డి సహా 12 మంది ఉన్నారు. సభ్యుల అనైతిక ప్రవర్తనకు సంబంధించి వచ్చే ప్రతి ఫిర్యాదునూ ఈ సంఘం పరిశీలిస్తుంది. నైతిక విలువలకు సంబంధించి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఉంది. మరికొన్ని సంఘాలకు కూడా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షులను నియమించారు.

సభ్యుల గైర్హాజరు సంబంధిత అంశాలు       పి.కరుణాకరన్‌
ప్రభుత్వ హామీలు                                               రమేష్‌ పోక్రియాల్‌ నిశాంక్‌
పత్రాల సమర్పణ                                               చంద్రకాంత్‌ బీ ఖైరే
అనుషంగిక శాసనాలు                                       దీలీప్‌ కుమార్‌ మున్సఖ్‌లాల్‌ గాంధీ 

No comments:

Post a Comment