ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థ విభజన కోసం ఏర్పాటైన షీలా ఖిడే కమిటీ గడువును కేంద్ర హోంశాఖ 2017 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఆ షెడ్యూల్‌లోని సంస్థలు, కార్పొరేషన్ల ఆస్తులు, అప్పును ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయడం ఈ కమిటీ ప్రధాన విధి. ఇప్పటివరకు 59 సంస్థల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మిగిలిన 30 సంస్థల విభజన పూర్తిచేయాల్సి ఉంది. ఈ పని పూర్తిచేయడానికి వీలుగా కమిటీ గడువును ఫిబ్రవరి వరకు కేంద్ర హోంశాఖ పొడిగించింది. 2014 మే 30న కమిటీ ఏర్పాటైనప్పుడు నిర్దేశించిన విధివిధానాలే యధావిధిగా కొనసాగుతాయి.
Friday, October 7, 2016
షీలా ఖిడే కమిటీ గడువు పొడిగింపు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment