కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం 2016 ఆగస్టు 26న హైదరాబాద్‌లో జరిగింది. బోర్డు ఛైర్మన్ రామ్‌శరణ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ ఏడాది అందుబాటులో ఉండే కృష్ణా జలాలను 63 : 37 నిష్పత్తిలోనే పంచుకోవాలని భావిస్తూ ఇందులో భాగంగా చిన్న నీటిపారుదల కింద నీటి వినియోగాన్ని ఎలా లెక్కించాలనే విషయాన్ని తేల్చేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఆ నిష్పత్తి ప్రకారమే ఈ ఏడాది నీటిని పంచుకుంటారు. ఇందులో చిన్న నీటి పారుదల కింద తెలంగాణకు 89 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 22 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి. ఈ వినియోగాన్ని ఎలా లెక్కించాలనేది తేల్చాల్సి ఉంది. దీన్ని తేల్చాడానికి రెండు రాష్ట్రాల అంతర్‌రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజినీర్లు, బోర్డు సభ్య కార్యదర్శి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. కృష్ణా నదీ జలాల్లో సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ 36 టీఎంసీలు, తెలంగాణ 15 టీఎంసీలు వినియోగించుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. బోర్డు త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Friday, September 2, 2016
కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment