Tuesday, August 15, 2023

NMC : నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నూతన నిబంధనలు

 

NMC-successsecret

  • రోగులకు చికిత్స సందర్భంగా అందించే మందుల చీటీలో జనరిక్‌ ఔషధాలనే రాయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) స్పష్టం చేసింది. ఒకవేళ అలా రాయని పక్షంలో సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు చేపడతామని, అవసరమైతే కొంతకాలం పాటు ప్రాక్టీస్‌ చేయకుండా అతని లైసెన్స్‌ను సైతం నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ‘రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్ల వృత్తిపరమైన ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు’ను ఎన్‌ఎంసీ జారీచేసింది. 
  • బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధాలను సైతం సూచించడం మానుకోవాలని అందులో వైద్యులకు సూచించింది. వైద్యులు ప్రస్తుతం జనరిక్‌ ఔషధాలను రాయాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనను ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యలను 2002లో భారతీయ వైద్య మండలి(ఐఎంసీ) జారీచేసిన నియమావళిలో ప్రస్తావించలేదు. 
  • ‘‘బ్రాండెడ్‌ ఔషధాలతో పోల్చితే జనరిక్‌ ఔషధాలు 30 శాతం నుంచి 80 శాతం చౌకగా లభిస్తాయి. అందువల్ల జనరిక్‌ ఔషధాలను సూచిస్తే ఆరోగ్య సంరక్షణ భారాన్ని తగ్గించడంతోపాటు, నాణ్యమైన సంరక్షణ పొందేందుకు వీలు కలుగుతుంది’’ అని ఆగస్టు రెండో తేదీన నోటిఫై చేసిన నిబంధనల్లో ఎన్‌ఎంసీ పేర్కొంది. మందుల చీటీలో సూచించిన పేర్లను స్పష్టంగా చదవగలిగేలా పొడి అక్షరాల్లోనే రాయాలని, వీలైతే మందుల చీటీని టైప్‌ చేసి ప్రింట్‌ తీసి ఇవ్వాలని పేర్కొంది. 
  • తాజా నిబంధనలను ఉల్లంఘించిన వైద్యులకు తొలుత హెచ్చరికలు జారీ చేస్తామని, అవసరమైతే వర్క్‌షాప్‌లకు హాజరవ్వాల్సిందిగా కోరతామని ఎన్‌ఎంసీ తెలిపింది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వైద్యుల లైసెన్స్‌ను కొంతకాలం పాటు సస్పెండ్‌ చేస్తామని ఉద్ఘాటించింది.

ఈ జబ్బుల మందులకు చీటీ అక్కర్లేదు

చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు మందుల దుకాణానికి వెళ్లి వైద్యుడి చీటీ లేకున్నా ఔషధాలు తీసుకునే వెసులుబాటును తొలిసారిగా ఎన్‌ఎంసీ కల్పించింది. ఈ మేరకు తాజా నిబంధనల్లో కొన్ని రకాల చికిత్సలకు సంబంధించిన జాబితాను రూపొందించింది.  అవి..

1) మొలలు తగ్గించే ఔషధాలు

2) టాపికల్‌ యాంటిబయాటిక్స్‌

3) దగ్గు తగ్గించే మందులు (కాఫ్‌ సప్రెసెంట్స్‌)

4) నొప్పి తగ్గించే మందులు

5) తలనొప్పి తగ్గించే ఔషధాలు

6) ముక్కుదిబ్బడ తగ్గించేవి

7) ఆస్ప్రిన్‌

8) రక్తనాళాలను విప్పార్చేవి

9) ఛాతీలో మంట తగ్గించే ఔషధాలు

10) దగ్గు మందులు (ఎక్స్‌పెక్టోరెంట్స్‌)

11) ఫంగస్‌ను తగ్గించేవి

12) అలర్జీని తగ్గించేవి

13) గ్యాస్‌ తగ్గించేవి

14) పొగతాగే అలవాటును మాన్పించే మందులు

  • సాధారణ జబ్బులకు పై కేటగిరీ ఔషధాలను ఎలాంటి వైద్య నిపుణుడి వద్ద చికిత్స తీసుకోకుండా, నేరుగా మందుల దుకాణంలో కొనుక్కొని వాడే వీలుందని ఎన్‌ఎంసీ తెలిపింది. అదే సమయంలో షెడ్యూల్‌ ‘హెచ్‌’ ఔషధాలకు మాత్రం వైద్యుడి చీటీ తప్పనిసరని స్పష్టం చేసింది.


National Medical Commission New Regulations

  • The National Medical Commission (NMC) has made it clear that only generic medicines should be written in the medicine slips given to patients during treatment. It has warned that strict action will be taken against the concerned doctor if he does not do so, and if necessary, his license will be suspended from practicing for some time. To this extent, the NMC has issued 'Regulations for the Professional Conduct of Registered Medical Practitioners'.
  • It also advised doctors to avoid prescribing branded generic medicines. Although doctors are currently required to prescribe generic drugs, the Indian Medical Council (IMC) regulations issued in 2002 did not mention the action to be taken in case of violation of that rule.
  • Generic drugs are available 30 percent to 80 percent cheaper than branded drugs. Therefore, prescribing generic drugs will reduce the healthcare burden and provide quality care," the NMC said in the regulations notified on August 2. It is stated that the names indicated in the medicine slip should be written in dry letters so that it can be read clearly, and if possible, the medicine slip should be typed and printed.
  • The NMC said that doctors who violate the latest rules will be issued warnings and if necessary they will be asked to attend workshops. It emphasized that the license of doctors who commit repeated violations will be suspended for a period of time.

Medicines for these diseases do not require a prescription

For the first time, NMC has made it possible for people to go to the drug store for minor ailments and take medicines without a doctor's note. To this end, a list of some types of treatment has been prepared in the latest regulations. They are..

1) Anti-inflammatory drugs

2) Topical antibiotics

3) Cough suppressants

4) Pain relievers

5) Medicines that relieve headache

6) Decongestants

7) Aspirin

8) Vasodilators

9) Medicines that reduce inflammation in the chest

10) Cough Medicines (Expectorants)

11) Antifungal

12) Reduce allergies

13) Gas reducers

14) Smoking cessation drugs

  • The NMC said that the above category of medicines for common diseases can be bought and used directly from the drug store without seeking treatment from any medical specialist. At the same time, it has been clarified that a doctor's note is required for Schedule 'H' drugs.

No comments:

Post a Comment