Friday, October 7, 2016

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి మార్గదర్శకాలకు కమిటీ


కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర జవనరుల మంత్రిత్వ శాఖ ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది. ప్రముఖ నీటిపారుదల రంగంలో నిపుణుడు, అంతర్జాతీయ స్థాయిలో  కమిటీల్లో పని చేసిన కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌ ఎ.డి.మొహిలే కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జల సంఘం మాజీ సభ్యులు ఎం.గోపాకృష్ణన్‌, హైడ్రాజీ విభాగం డైరెక్టర్‌ నిత్యానందరాయ్‌, రూర్కీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాజీ శాస్త్రవేత్త ఎం.కె.గోయల్‌తోపాటు కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు.

No comments:

Post a Comment