Friday, October 7, 2016

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాని అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు


భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్న అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సును కేంద్రం ఆమోదించింది. సరిహద్దుల్లో భద్రతను పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, నదులు ఉన్నచోట గస్తీ పెంచాలని సూచించింది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి మధుకర్‌గుప్తా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. 2016 జనవరిలో పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్‌ నుంచి జమ్మూ ప్రాంతం వరకూ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పరిస్థితులను మదింపు చేసి కమిటీ ఈ సూచనను చేసింది. భారత్‌-పాక్‌ మధ్య ఉన్న 3323 కి.మీ. సరిహద్దుల్లో 1225 కి.మీ. జమ్మూకశ్మీర్‌ ప్రాంతంలో (నియంత్రణ రేఖ సహా) ఉంది. పంజాబ్‌లో 533, రాజస్థాన్‌లో 1037, గుజరాత్‌లో 508 కి.మీ. సరిహద్దు ఉంది.

No comments:

Post a Comment