Wednesday, August 2, 2023

తీవ్ర శారీరక శ్రమ కొద్ది నిమిషాలైనా మేలే


  • రోజువారీ పనుల్లో భాగంగా ఆయాసపడే స్థాయిలో 4-5 నిమిషాల పాటు చేసే తీవ్ర శారీరక శ్రమ వల్ల క్యాన్సర్ల ముప్పు 32 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 
  • వ్యాయామాలు చేయని 22వేల మంది రోజువారీ కార్యకలాపాలను.. శరీరంపై ధరించే వేరబుల్‌ సాధనాల డేటా ఆధారంగా వీరు పరిశీలించారు. ఏడేళ్ల పాటు పరీక్షార్థుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. వారికి క్యాన్సర్‌ వచ్చిందా అన్నది పరిశీలించారు. ఏమాత్రం శారీరక శ్రమ చేయనివారితో పోలిస్తే.. దైనందిన జీవనశైలిలో భాగంగా నిమిషం నిడివి ఉండే తీవ్రస్థాయి శారీరక శ్రమను రోజులో 4-5 నిమిషాల పాటు చేసినా.. అన్నిరకాల క్యాన్సర్ల ముప్పు 18 శాతం మేర తగ్గుతుందని వెల్లడైంది. 
  • శారీరక శ్రమతో ముడిపడ్డ క్యాన్సర్ల విషయంలో ఇది 32 శాతంగా ఉందని తేలింది. ఇంటిపని, సరకుల దుకాణంలో చురుగ్గా షాపింగ్‌ చేయడం, వేగంగా నడవడం, పిల్లలతో కలిసి తీవ్రస్థాయి శారీరక శ్రమతో కూడిన ఆటలు వంటివి కొద్దిసేపు సాగించినా ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోజువారీ పనిలో భాగంగా చేసే తీవ్ర శ్రమను కొలిచే సాధనాలు ఇటీవలి వరకూ లేదు. వేరబుల్‌ ఎలక్ట్రానిక్‌ సాధనాలు రావడంతో పరిస్థితి మారిందని పరిశోధకులు తెలిపారు.

No comments:

Post a Comment