Saturday, August 12, 2023

PMJAY : పీఎంజేఏవై కాగ్‌ నివేదిక

 


  • ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్యానల్‌ అయిన 1,421 ఆసుపత్రుల్లో 524 ఆసుపత్రులు ఎలాంటి సేవలూ అందించడం లేదని కాగ్‌ పేర్కొంది. వాటి నుంచి ఒక్క క్లెయిమ్‌ కూడా రాలేదని తెలిపింది. 
  • మరో 81 ఆసుపత్రుల నుంచి 5 వరకు మాత్రమే క్లెయిమ్‌లు వచ్చినట్లు వెల్లడిరచింది. దీన్ని బట్టి ఇక్కడ ఎంప్యానల్డ్‌ ఆసుపత్రులు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదని తెలుస్తున్నట్లు కాగ్‌ అభిప్రాయపడిరది. 
  • 2018 నుంచి 2021 మార్చి వరకు ఈ పథకం అమలు తీరు గురించి అధ్యయనం చేసి పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్‌ ఈ విషయాన్ని వెల్లడిరచింది. ఆంధ్రప్రదేశ్‌లోని 6 జిల్లాల్లోని 48 ఆసుపత్రుల నుంచి నమూనాలు సేకరించి పరిస్థితిని విశ్లేషించినట్లు పేర్కొంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రులకు రూ. 19.12 కోట్లు అధికంగా చెల్లించారు. ఇక్కడ స్టేట్‌ హెల్త్‌ అథారిటీ (ఎస్‌హెచ్‌ఏ) నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్యసేవలు అందిస్తోంది. ప్రతి ప్యాకేజీ రేట్లు ముందే ఖరారయ్యాయి. అయితే క్లెయిమ్స్‌ డేటా పరిశీలిస్తే 20,354 క్లెయిమ్‌లను అధిక ప్యాకేజీ రేట్లతో ఎస్‌హెచ్‌ఏ ఆమోదించినట్లు కనిపించింది. తద్వారా ఆసుపత్రులకు రూ. 19.12 కోట్లు అధికంగా చెల్లించారు. మరోవైపు సర్జికల్‌, మెడికల్‌ ప్యాకేజీలను ఒకేసమయంలో బుకింగ్‌ చేసుకోవడానికి పీఎంజేఏవై మార్గదర్శకాలు అనుమతించవు. అయినప్పటికీ సర్జికల్‌ ప్రొసీజర్స్‌తోపాటు, మెడికల్‌ ప్రొసీజర్స్‌కు రూ. 4.63 కోట్లు చెల్లించారు. ఇందుకు ఎస్‌హెచ్‌ఏ ఆమోదముద్ర వేసింది.
  • జాతీయ వైద్య ప్రాధికార సంస్థతో పంచుకున్న డేటాలో కీలకమైన తేదీలు లేవు.  
  • 2 కేసుల్లో డిశ్చార్జి చేసిన తర్వాత సర్జరీ చేసినట్లు తేదీ చూపారు. ఇలాంటి క్లెయిమ్‌లకు రూ. 28,602 చెల్లించారు.
  • 37,602 కేసుల వయసు జీరోగా, ఏడుగురి రోగుల వయసు 100 నుంచి 139 వరకు చూపారు.
  • నేషనల్‌ హెల్త్‌ అథారిటీ 2020 జనవరి 1 నుంచి డిసెంబరు 31వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హెల్త్‌ అథారిటీకి రూ. 8.37 కోట్ల గ్రాంట్‌ అధికంగా చెల్లించింది.
  • ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ హెల్త్‌ అథారిటీలో మానవ వనరుల కొరత ఉంది. ఇక్కడ 230 పోస్టులకుగాను 178 మందే పనిచేస్తున్నారు.  
  • ఈ పథకం కింద ఎంప్యానల్‌ అయిన ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్షమంది జనాభాకు 12.4 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment