ఉద్యోగం చేసే మహిళలకు దేశంలో ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బెస్ట్ అని అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్‌ఐఎస్), నాథన్ అసోసియేట్స్ ఎకనమిక్ కన్సల్టింగ్ కంపెనీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. దేశ రాజధాని అయిన డిల్లీ నగరం పరమ వేస్టని నివేదిక స్పష్టంచేసింది. వీరి సర్వే ప్రకారం మహిళలు పనిచేయడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా సిక్కింను గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి అత్యధికంగా సిక్కింకు 40 పాయింట్లు రాగా, తెలంగాణకు 28.5 పాయింట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 24 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. డిల్లీకి అత్యల్పంగా 8.5 పాయింట్లు మాత్రమే వచ్చాయి.
ఫ్యాక్టరీలు, రిటైల్, ఐటీ రంగాల్లో మహిళలకు పని గంటల్లో నిబంధనలు, ఉద్యోగినుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు, మహిళా ఉద్యోగుల సంఖ్య, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం, వారి స్టార్టప్స్‌కు చేస్తున్న సహాయం.. ఈ నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు రేటింగ్ ఇచ్చారు.
జాబితా
- సిక్కిం
- తెలంగాణ
- పుదుచ్చేరి
- కర్ణాటక
- ఆంధ్రప్రదేశ్
- కేరళ
- మహారాష్ట్ర
- తమిళనాడు
- ఛత్తీస్‌గఢ్
- సిక్కిం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నాలుగు రాష్ట్రాలు ఫ్యాక్టరీలు, రిటైల్, ఐటీ రంగాల్లో రాత్రి వేళల్లో మహిళల పనిపై అన్ని నిబంధనలు తొలగించాయని నివేదిక వెల్లడించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కోర్టు ఆదేశాలతో నిబంధనలు తొలగించాయి.
- అయితే మహారాష్ట్రలో రాత్రి పది గంటల వరకు మహిళలను పనికి అనుమతిస్తారు. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏ రంగాల్లోనూ మహిళలను రాత్రివేళ పనికి అనుమతించడంలేదని నివేదిక తెలిపింది.
No comments:
Post a Comment