Saturday, August 12, 2023

TB : సరైన పోషణతో క్షయ వ్యాప్తికి స్వస్తి


  • క్షయ వ్యాధి బాధితుల కుటుంబాల్లో ఇతరులకూ ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. అటువంటి వారికి సరైన పోషకాహారం అందిస్తే క్షయ వచ్చే ప్రమాదం సగానికి సగం తగ్గిపోతుందని ఓ అధ్యయనం తెలిపింది. 
  • మంగళూరులోని యెనెపోయా వైద్య కళాశాలతోపాటు పలు జాతీయ సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. కెనడాకు చెందిన మెగిల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులూ పాలు పంచుకున్నారు. 
  • రaార్ఖండ్‌లోని నాలుగు జిల్లాల్లో 2,800 మంది క్షయ రోగుల కుటుంబ సభ్యులపై అధ్యయనం చేశారు. ప్రతి క్షయ రోగికి నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, పాల పొడితో కూడిన 10 కిలోల సంచీని అందించారు. 
  • రోగి కుటుంబ సభ్యులకు తలా 5 కిలోల బియ్యం, ఒకటిన్నర కిలోల పప్పుల చొప్పున ఇచ్చారు. వారెవరికీ క్షయ లేదని ముందే నిర్ధారించుకున్నారు. అధ్యయనానికి ఎంచుకున్న వారిలో మూడిరట రెండొంతుల మంది రaార్ఖండ్‌ గిరిజన తెగలకు చెందినవారే. 
  • అధ్యయనం చేసిన మొత్తం కుటుంబీకుల్లో 34 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల క్షయతో బాధపడుతున్న రోగుల కుటుంబ సభ్యులకు బలమైన ఆహారం అందించినప్పుడు వారికి అన్ని రకాల క్షయ సోకే ప్రమాదం 40 శాతం, అంటువ్యాధిలా వ్యాపించే క్షయ 50 శాతం తగ్గిపోయింది. 
  • అసలు సగం మంది క్షయ రోగులకు పోషకాహార లోపంవల్లే వ్యాధి వచ్చింది. సరైన  పోషణ లభించి మొదటి రెండు నెలల్లో బరువు పెరిగిన రోగుల్లో 60 శాతం మందికి మృత్యు ప్రమాదం తప్పింది. చికిత్స ప్రారంభమైనప్పుడు 3 శాతం మంది రోగులే పని చేయగల స్థితిలో ఉండగా, చికిత్స పూర్తయ్యాక 75 శాతం మంది పని చేయడానికి సత్తువ సంపాదించగలిగారు. 
  • బలమైన ఆహారం క్షయ చికిత్సలో అంతర్భాగం. 2021లో భారతదేశంలో 30 లక్షల మంది క్షయ రోగులు ఉండగా, వారిలో హెచ్‌ఐవీ లేని రోగులు 4,94,000 మంది మరణించారు. 2025కల్లా క్షయ మరణాలను 90 శాతం తగ్గించాలని భారత్‌ లక్షిస్తోంది.

No comments:

Post a Comment