Saturday, August 12, 2023

Elnino, Lanina : ఎల్‌ నినో, లా నినాల ప్రభావం ఉత్తర భారత్‌పైనే ఎక్కువ

 


  • ఉత్తర భారతంలో వర్షపాతంపై ఎల్‌ నినో, లా నినాల ప్రభావం చాలా బలంగా ఉంటుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. మధ్య భారత్‌లో వానల రాకను మాత్రం అవి అంతగా ప్రభావితం చేయడం లేదని నిర్ధారించింది. 
  • ఎల్‌ నినో, లా నినా అనేవి రెండు పరస్పర విరుద్ధ దృగ్విషయాలు. ఎల్‌ నినో వల్ల దక్షిణ అమెరికా సమీపంలో పసిఫిక్‌ మహాసముద్ర జలాలు వేడెక్కుతాయి. రుతుపవనాలు బలహీనపడతాయి. భారత్‌లో వర్షపాతం తగ్గుతుంది. 
  • లా నినాతో మన దేశంలో వానలు సమృద్ధిగా కురుస్తాయి. వీటిపై పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరియాలజీ శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం తాజాగా ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. 
  • అందులో తేలిన అంశాల ప్రకారం- వర్షపాతంపై ఎల్‌ నినో, లా నినాల ప్రభావం 1901 నుంచి 1940 వరకు గణనీయంగా పెరిగింది. 1941-80 మధ్య అది నిలకడగా ఉంది. 1981 తర్వాత బలహీనపడిరది. అయితే భారత్‌ అంతటా పరిస్థితి ఒకేలా మాత్రం లేదు. ఉత్తర భారత్‌పై ఎల్‌ నినో, లా నినాల ప్రభావం గత కొన్ని దశాబ్దాల్లో బాగా పెరిగింది. మధ్య భారత్‌పై తగ్గింది. దక్షిణ భారత్‌ విషయంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులు చోటుచేసుకోలేదు.

No comments:

Post a Comment