- సుప్రీంకోర్టు, హైకోర్టు ఉన్నత న్యాయమూర్తుల పదవుల్లో వైవిధ్యం లోపించిందనీ, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలకు ఆ పదవుల్లో సముచిత ప్రాతినిధ్యం లభించడం లేదని పార్లమెంటరీ సంఘం అభిప్రాయపడిరది.
- న్యాయ, సిబ్బంది వ్యవహారాలపై ఏర్పడిన ఈ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి భాజపా సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ నేతృత్వం వహిస్తున్నారు. న్యాయ ప్రక్రియలు, సంస్కరణలపై ఈ సంఘం నివేదిక సమర్పించింది. ఉన్నతస్థాయి న్యాయస్థానాలలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం రానురానూ తగ్గిపోతోందని విచారం వ్యక్తం చేసింది.
- సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్ పద్ధతి లేకపోయినా, భారతీయ సమాజంలోని వివిధ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొంది. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు పాటించాల్సిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని పొందుపరచాలని సూచించింది.
Saturday, August 12, 2023
Justice : ఉన్నత న్యాయస్థానాల్లో బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం లభించాలి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment