Saturday, August 12, 2023

Girl Eductaion : ‘గ్రామీణ భారతంలో ప్రాథమిక విద్య స్థితిగతులు-2023’

 


  • తమ అమ్మాయి ఉన్నత విద్య అభ్యసించాలని ఊర్లలోనూ అత్యధిక శాతం తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. ఆడపిల్లల్ని కనీసం గ్రాడ్యుయేషన్‌ చదివించాలని గ్రామీణ భారత్‌లో కనీసం 78% తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు నిర్ధారించింది. 
  • 20 రాష్ట్రాల్లో 6,629 గ్రామీణ కుటుంబాలపై ట్రాన్స్‌ఫార్మింగ్‌ రూరల్‌ ఇండియా ఫౌండేషన్‌ (టీఆర్‌ఎఫ్‌ఐ) నిర్వహించిన సర్వే నివేదికను ‘గ్రామీణ భారతంలో ప్రాథమిక విద్య స్థితిగతులు-2023’ పేరుతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2023 ఆగస్టు 8న విడుదల చేశారు.

నివేదికలోని ముఖ్యాంశాలు..

  • పిల్లల ఉన్నత చదువులకు సంబంధించి తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో పెద్దగా వ్యత్యాసమేమీ లేదు. బాలుర తల్లిదండ్రుల్లో 82% మంది తమ పిల్లాడిని కనీసం డిగ్రీ, వీలైతే అంతకంటే ఎక్కువ చదివించాలని కోరుకుంటున్నారు. బాలికల తల్లిదండ్రుల్లో 78% మంది అలా ఆకాంక్షిస్తున్నారు.
  • బాలుర డ్రాపవుట్లలో నాలుగో వంతు.. ప్రాథమిక విద్య సమయంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఆ దశలో బాలికల డ్రాపవుట్లు 35% వరకూ ఉంటున్నాయి.
  • ప్రాథమిక విద్య ముగిశాక చదువు మానేసేవారి సంఖ్య బాలురలో 75%, బాలికల్లో 65% దాకా కనిపించింది. సొంత ఊర్లలో, వాటికి చేరువలో అంతకంటే ఎక్కువ చదువుకునేందుకు విద్యాసంస్థలు అందుబాటులో లేకపోవడం అందుకు ఓ కారణం.
  • 62.5% చిన్నారులు ఇంటికొచ్చాక వారి తల్లి పర్యవేక్షణలో చదువుకుంటున్నారు.
  • 38% పైగా తల్లిదండ్రులు ప్రైవేటు ట్యూటర్లనూ ఏర్పాటుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
  • దాదాపు 73% పిల్లలు రోజుకు రెండు కంటల కంటే తక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నారు. 1-3 తరగతుల చిన్నారుల్లో 16.8% మంది ప్రతిరోజు 2-4 గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌ చూస్తుండగా.. 8వ తరగతి, ఆపైన చదువుకుంటున్నవారిలో అంతసేపు స్మార్ట్‌ఫోన్‌ వాడేవారు 25.4% దాకా ఉన్నారు.

No comments:

Post a Comment