తెలంగాణలో మరో 8 కొత్త వైద్య కళాశాలలు
- తెలంగాణలో మరో 8 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
- ఒక్కో కళాశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. దీంతో కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు పది వేలకు చేరువకానున్నాయి.
No comments:
Post a Comment