Tuesday, July 25, 2023

పేదరికం ఓడించాలని చూసినా..పట్టుదల గెలిపించింది

ఒక దినసరి కూలీ... chemistry లో phd...నిన్నటి రోజు సోమవారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రాంగణమంతా స్నాతకోత్సవ సందడి అలముకుంది. వేదిక పసిడి కాంతులు పులుముకుంది. కార్యక్రమానికి ఛాన్సలర్‌ హోదాలో ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్‌ నజీర్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. అంతా హడావిడిగా ఉండటంతో వేదిక దిగువ నుంచి వెదజల్లుతున్న మట్టి పరిమళాలను ఎవరూ గుర్తించలేకపోయారు. కొంత సమయం తరువాత మైకులో సాకే భారతి అనే పిలుపు వినిపించింది. మోడరన్ దుస్తులు ధరించిన అమ్మాయి వేదికపైకి వస్తుందనుకున్నారంతా. కానీ.. అలా జరగలేదు.
***
#పీహెచ్‌డీ_పట్టా_ఆమె_చేతిలో_కాంతులీనింది 
పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి వేదిక మీదకు భర్త, కూతురితో కలిసి వచ్చింది సాకే భారతి. అరిగిపోయిన హవాయి చెప్పులూ, ఓ సాదా చీర కట్టుకొచ్చిన ఆమె ఆహార్యాన్ని చూసి వేదికమీది పెద్దలూ, అతిథుల ముఖాల్లో ఒకటే ఆశ్చర్యం. పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేస్తూ నడిచొస్తున్న ఆ చదువుల సరస్వతిని చూసి అబ్బుర పడ్డారంతా. అప్రయత్నంగా చేతులన్నీ ఒక్కటై చప్పట్లతో ప్రాంగణమంతా మార్మోగింది. అయినా.. భారతిలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు. పీహెచ్‌డీ పట్టా ఆమె చేతుల్లో చేరి కాంతులీనింది.

No comments:

Post a Comment